SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

సింగరేణి కార్మికులకు బిగ్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ. 1.10లక్షలు.. పూర్తి వివరాలివే..!!

Singareni Bonus: సింగరేణి సంస్థలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న బొగ్గు గని కార్మికులకు యాజమాన్యం గుడ్ న్యూస్ వినిపించింది. రాబోయే దీపావళి పండుగ కానుకగా ప్రతీ అర్హులైన కార్మికునికి రూ. 1,10,250 చొప్పున పీఎల్‌ఆర్ (Performance Linked Reward) బోనస్ చెల్లించేందుకు కోల్ ఇండియా యాజమాన్యం.. జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 04, 2026, 09:55 AM IST | Updated: Oct 04, 2026, 09:56 AM IST
Image Credit: Singareni Bonus
Join

Singareni Bonus: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులకు యాజమాన్యం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంవత్సరం దీపావళి గిఫ్టుగా ప్రతి కార్మికునికి రూ. 1,10,250 చొప్పున PLR బోనస్ చెల్లించడానికి  కోల్ ఇండియా యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. గత ఏడాదితో పోల్చితే.. ఈసారి బోనస్ మొత్తం భారీగా పెరగడంతో కార్మిక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కతాలో శనివారం కోల్ ఇండియా చైర్మన్ సాయిరామ్ అధ్యక్షతన జేబీసీసీఐ అపెక్స్ జేసీసీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో AITUC, BMS, CITU, HMS, వంటి ప్రధాన జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్మికుల హక్కులు, బోనస్ అంశంపై ప్రధానంగా చర్చించారు. ప్రారంభంలో కార్మిక సంఘాల ప్రతినిధులు రూ. 1.20లక్షల పీఎల్ఈర్ బోనస్ ఇవ్వాలంటూ పట్టుబట్టాయి. లంచ్ బ్రేక్ తర్వాత యాజమాన్యం, యూనియన్ల మధ్య సాగిన చర్చల ఫలితంగా రూ. 1, 10, 250 వద్ద ఏకాభిప్రాయం కుదిరింది. గత ఏడాది కోల్ ఇండియా, సింగరేణి కార్మికులకు రూ. 1, 03,000 బోనస్ అందించారు.

ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 1,96,753 మంది బొగ్గు గని కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. దీనిలో ఒక్క సింగరేణి పరిధిలో సుమారు 32వేల మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. అంతేకాదు 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య కాలంలో రిటైర్డ్ అయిన వారు దాదాపు 8,351 మంది పూర్వ ఉద్యోగులకు కూడా నిబంధనల ప్రకారం ఈ పీఎల్ఆర్ బోనస్ వర్తిస్తుందని యూనియన్ నాయకులు తెలిపారు.

బోనస్ ప్రకటన మాత్రమే కాకుండా.. గనులలోని కార్మికుల భద్రత, వృత్తిపరమైన సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులు చర్చించారు. బోనస్ మొత్తంపై ఏకాభిప్రాయం కుదిరినందున, సింగరేణి యాజమాన్యం త్వరలో అధికారిక ఉత్తర్వులను, చెల్లింపు తేదీని ప్రకటించనుంది. రూ.1.10 లక్షలకు పైగా ఉన్న ఈ పండుగ సీజన్ బోనస్, బొగ్గు గని కార్మికుల కుటుంబాలలో పండుగ వాతావరణం నెలకొంది. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES