Special Intensive Revision: తెలంగాణలో 18 యేళ్లు నిండిన లేదా ఇప్పటికే జాబితాలో పేరు గల్లంతైన అర్హులైన ఓటర్లు రాబోయే ఓటరు లిస్టులో తమ పేరు నమోదు చేసుకోవడానికి నేటితో గడువు ముగయనుంది.ముఖ్యంగా SIR ప్రక్రియలో ఓటు కోల్పోయిన వారికి ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు ఇవాళే ఆఖరు తేదీ. ఫారం–6 దరఖాస్తు ద్వారా తమ ఓటును నమోదు చేసుకోవాలి. నేటితో కొత్త ఓటర్ల నమోదు ముగిసిన తరువాత నవంబర్ 9న సమరించిన ఓటర్ల జాబితాను వెల్లడిస్తారు.
2026 అక్టోబర్ 1తో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదుకు అర్హులే ..
సర్ కార్యక్రమంలో భాగంగా అభ్యంతరాలతోపాటు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల వివరాల్లో మార్పునకు దరఖాస్తులు చేసుకోవడానికి గడువు నేటితో ముగియనుంది. 2026 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడి నుంచి కొత్త ఓటరుగా నమోదు కోసం ఫారం–6 దరఖాస్తు చేయాలి. ముసాయిదా జాబితాలో పేరు లేని వారు త్వరలో ప్రకటించనున్న ‘సర్’తుది ఓటర్ల జాబితాలో చోటు కోసం ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోకపోయి ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు మాత్రమే మిగిలిఉంది.
2002 తర్వాత దేశ వ్యాప్తంగా గతేడాది బిహార్ ఎన్నికల నుంచి సమగ్ర ఓటరు ప్రక్షాళన మొదలుపెట్టింది. ఒక్క దేశం.. ఒక్క ఓటు అనే లక్ష్యంతో భారత ఎన్నికల కమిషన్ ఈ ఓటర్ల ప్రక్షాళన మొదలుపెట్టింది. చాలా మంది తామున్న ఊరితో పాటు పనిచేసే ప్రదేశంలో ఓటు హక్కు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఇలా ఒకటి కంటే ఎక్కువ ఓటు హక్కు ఉన్న వారు ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు చనిపోయిన వారి ఓట్లను తొలిగించడం వంటివి చేస్తున్నారు. ఇది నెహ్రూ హయాం నుంచి వస్తున్నదే. నిన్నటి వరకూ తెలంగాణలో 4.4 లక్షల ఫారం 6 దరఖాస్తులు స్వీకరించిన ఎన్నికల సంఘం .
ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్..
ఇప్పటికే ఓటర్ల డ్రాఫ్ట్ లిస్టులో పేర్లు ఉన్న చాలా మందికి కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్.. తదితర కారణాల వల్ల వాళ్లకు నోటీసులు ఇష్యూ చేశారు. ఇక స్థానికంగా ఉండే బీఎల్‌వోలలో చాలా మందికి దీనిపైనా సరైన అవగాహన ఉండటం లేదు. ఇంటింటికి తిరిగి పంపిణి చేయాల్సిన నోటీసులను ఒకచోట కూర్చొని నోటీసులు వచ్చిన ఓటర్లకు రోజుకు 30 మంది చొప్పున ఫోన్ చేస్తూ తమ దగ్గరకు పిలిపించుకుని నోటీసులకు సంబంధించిన పత్రాలను తీసుకొని అప్‌లోడ్ చేస్తున్నారు.