SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad: పుట్టిన రోజునాడే నిండిన నూరెళ్లు.. ట్యాంక్ బండ్ వద్ద లారీ ఢీకొని చిన్నారితో పాటు, బంధువు దుర్మరణం..

Six year girl died in hyderabad road accident: కేక్‌ కట్‌ చేసి పుట్టినరోజు సంబరాలు చేసుకోవాలనే ఉద్దేశంతో సదరు కుటుంబం ట్యాంక్ బండ్ మీదకు వెళ్లారు. ఈ క్రమంలో లారీ వేగంగా వచ్చి వారిని ఢీకొనడంతో స్పాట్లో దుర్మరణం చెందారు. ట్యాంక్ బండ్ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదకరంగా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 05, 2026, 08:32 AM IST | Updated: Oct 05, 2026, 08:36 AM IST
Image Credit: sixyeargirldiedintankbundaccidenthyderabad
Join

Six year old girl and her relative killed in tank bund road accident: హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద చాలా మంది బర్త్ డే వేడుకలు, ఇతర సెలబ్రేషన్స్ చేసుకుంటారు. తమ బంధువులు, స్నేహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. అయితే.. ఇదే విధంగా సరదాగా ట్యాంక్ బండ్ మీద గడిపేందుకు వెళ్లిన ఒక కుటుంబం తీవ్ర విషాదంలో చిక్కుకుంది. 
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని ఓల్డ్‌ అల్వాల్‌ జొన్నబండ ప్రాంతానికి చెందిన సాయినాథ్‌, అశ్విని దంపతులకు ఇద్దరు కుమార్తెలు.

అయితే.. వీరిలో చిన్న కుమార్తె సరాక్షి ఆరో పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించాలనుకున్నారు.  ఈ క్రమంలో సాయినాథ్ తన ఫ్యామిలీతో పాటు తమ బంధువులైన విశ్వనాథ్‌, ఆయన భార్య సింధుతో కలిసి కూకట్ పల్లికి వెళ్లారు. అక్కడ పీవీఆర్ మాల్ లో మూవీ చూశారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్ కు వెళ్లి కేక్ కట్ చేయాలని భావించారు. అందరు కలిసి తమ తమ కార్లలో..  మగ్దూం మొహియుద్దీన్‌ విగ్రహం సమీపంలో వారు కారును పార్క్‌ చేశారు. 

ఇంతలో హుస్సేన్‌ సాగర్‌ వైపు వెళ్లేందుకు విశ్వనాథ్‌ రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. ఇంతలో రోడ్డు దాటుతున్న సమయంలో సికింద్రాబాద్‌ వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో చిన్నారి సరాక్షి, విశ్వనాథ్ లో ఎగిరి పడ్డారు. చిన్నారి సరాక్షి స్పాట్ లో తీవ్ర రక్త స్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. 

విశ్వనాథ్‌కు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. తమ చిన్నారిని కేక్‌ కటింగ్‌ కోసం తీసుకొచ్చిన కుటుంబం.. కళ్ల ముందు విగత జీవిగా మారిపోవడంతో ఆ కుటుంబం గుండెలు పగిలేలా రోదించారు. పుట్టిన రోజునాడే నిండు నూరెళ్లు నిండిపోవడంతో ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను పట్టుకుని ఏడ్వడం అందరిని కలిచి వేసింది.

మరోవైపు, 3 నెలల క్రితమే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విశ్వనాథ్‌ మృతితో ఆయన భార్య, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.  ఈ ఘటనపై దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్‌ ఫరూఖ్‌, హెల్పర్‌ సయీద్‌ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES