Hyderabad: గచ్చిబౌలీలో తీవ్ర విషాదం.. సూసైడ్ నోట్ రాసి ఐటీ ఉద్యోగిని బలవన్మరణం.. అసలు కారణం ఏమిటంటే..?..
Soft ware employee suicide in Gachibowli: గత కొన్ని రోజులుగా ఒంటరితనంతో పాటు ఒత్తిడితో బాధపడుతున్నట్లు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తన సూసైడ్ నోట్ లో రాసుకొచ్చింది. ఈ ఘటన తీవ్ర విషాదకరంగా మారింది.
Soft war employee commits suicide in Gachibowli: ఇటీవల కాలంలో చాలా మంది యువతీ, యువకులు ప్రతి చిన్న విషయాలకు తీవ్ర ఒత్తిడికి గురౌతున్నారు. కొంత మంది అతిగా ఆలోచించడం, ఒత్తిడికి గురౌతున్నారు. ప్రతి చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూసి దారుణాలకు పాల్పడుతున్నారు. కొంత మంది ఉద్యోగంలో సమస్యలు మరికొంత మంది వ్యక్తిగత జీవితాల్లో సమస్యల ఏర్పడటం వల్ల ఒత్తిడికి గురై తమ నిండూ నూరెళ్ల జీవితాన్ని ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని ముగించుకుంటున్నారు. ఈ క్రమంలో గచ్చిబౌలిలో 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణంకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదకరంగా మారింది.
హైదరాబాద్ లోని గచ్చి బౌలీలో మహిళ ఉద్యోగిని బలవన్మరణంకు పాల్పడింది. డీఎల్ఎఫ్ గేట్-2 ఎదురుగా హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన మనీషా హస్టల్ లో ఉంటూ ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె తన తండ్రికి సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడింది.
హస్టల్ గదిలో టెకీ విగత జీవిగా మారడంతో సిబ్బంది, చుట్టుపక్కల ఉన్న రూమ్ వారు గమనించి వెంటనే పోలీసులకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో డెడ్ బాడీని పోలీసులు పోస్ట్ మార్టంకు తరలించారు. గదిలో రెండు పేజీల సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దీనిలో.. గత కొన్ని రోజులుగా ఉద్యోగంలో సమస్యలు, లోన్లీనెస్ వల్ల చాలా ఒత్తిడికి గురైనట్లు తెలిపింది. ఈ క్రమంలో ఇక జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసింది. ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.