• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • / ఇన్ సర్వీస్ టీచర్లకు అలర్ట్.. స్పెషల్ టెట్ 2 నోటిఫికేషన్ విడుదల..!!

ఇన్ సర్వీస్ టీచర్లకు అలర్ట్.. స్పెషల్ టెట్ 2 నోటిఫికేషన్ విడుదల..!!

Special TGTET 2026: తెలంగాణలోని ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్. ఇన్ సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. నవంబర్ 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 01, 2026, 05:21 PM IST|Updated: Oct 01, 2026, 05:23 PM IST
joinshare
 ఇన్ సర్వీస్ టీచర్లకు అలర్ట్.. స్పెషల్ టెట్ 2 నోటిఫికేషన్ విడుదల..!!
Image Credit: Special TGTET 2026

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Special TGTET 2026: తెలంగాణ ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్ల కోసం నిర్వహించనున్న స్పెషల్ టెట్ 2 కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 7 నుంచి 16 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్ట్ టీజీ టెట్ చైర్ పర్సన్ నవీన్ నికోలస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ ను సందర్శించాలని ఆయన సూచించారు.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 1, 2026

సమాచార బులెటిన్ అందుబాటులో: అక్టోబర్ 7, 2026

దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: అక్టోబర్ 7, 2026

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 16, 2026

పరీక్ష తేదీలు: నవంబర్ 16 నుండి నవంబర్ 21 వరకు

నవంబర్ 11, 2026 వరకు (కంప్యూటర్ ఆధారిత పరీక్ష - CBT విధానం)

వెంటనే నోటిఫీకేషన్ వద్దన్నా విడుదల: 

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా TETలో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, ప్రభుత్వం ప్రత్యేకంగా సేవలో ఉన్న ఉపాధ్యాయుల కోసం సంవత్సరానికి రెండుసార్లు TET నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా, రాష్ట్రంలో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం మొదటిసారిగా నిర్వహించిన ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET-1) ఫలితాలు గత నెలలో విడుదలయ్యాయి. 70.07 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

సెప్టెంబర్ 8, 9 తేదీలలో జరిగిన పేపర్ 1, పేపర్ 2లతో కూడిన ఈ ప్రత్యేక టెట్ పరీక్షకు మొత్తం 24,986 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 22,477 మంది పరీక్షకు హాజరు కాగా, 15,749 మంది అర్హత సాధించారు. మొదటి టెట్ పరీక్ష జరిగిన వెంటనే, అంటే అక్టోబర్ 1వ తేదీన, ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం టెట్ పరీక్షకు నోటిఫికేషన్ జారీ చేయవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం (టీఎస్‌పీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ, ప్రధాన కార్యదర్శి రోహిత్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. నోటిఫికేషన్‌కు, పరీక్షకు మధ్య కనీసం మూడు నెలల వ్యవధి ఉండాలని వారు ఇటీవల ఒక ప్రకటనలో కోరారు. అయినప్పటికీ, ప్రభుత్వం టెట్‌కు ప్రాధాన్యతనిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Employees
Telangana News