SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gajwel Mro Video: నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా.?.. రైతుపై గజ్వేల్ ఎమ్మార్వో వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్..

Gajwel mro controversy video: గజ్వేల్ కు చెందిన రైతు పట్ల ఎమ్మార్వో స్వామి చాలా నీచంగా మాట్లాడాడు.ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో అధికారులు చర్యలు తీసుకొవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Oct 10, 2026, 03:06 PM IST | Updated: Oct 10, 2026, 03:21 PM IST
Image Credit: Gajwel mro controversy video
Join

Tahsildar makes derogatory comments on farmer in Gajwel: దేశానికి రైతులు వెన్నెముక లాంటి వారని చెప్తుంటారు. రైతులు పంటలు పండిస్తేనే  ఆ దేశం ఎంతో సుభిక్షంగా ఉంటుంది. అంతే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం రైతన్నలు యూరియా కొరత, పంటకు మద్దతు ధరలు, ఎల్ నినో సమస్యలు, వర్షాలు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

 

 

కొన్ని చోట్ల పంట కొసం ఎంత కష్టపడ్డ  కూడా చేతికి వచ్చే సరికి ఏదో కారణంతో రైతన్నలు నష్టపోయిన ఘటనలు కొకొల్లలు. దీంతో కొంత మంది రైతన్నలు చేసిన అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగుతారు. 

మరికొంత మంది మాత్రం నష్టపరిహరం కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టు తిరుగుతుంటారు. అయితే.. కొంత మంది అధికారులు రైతన్నలకు నష్టపరిహరం అందించడంతో తమ తోడ్పాటు అందిస్తారు. కానీ మరికొంత మంది మాత్రం రైతులను తమ ఆఫీసుల చుట్టు తిప్పుకుంటూ చాలా చులకనగా చూస్తారు. ఈక్రమంలో గజ్వేల్  లో ఒక ఎమ్మార్వో రైతు పట్ల చాలా నీచంగా మాట్లాడాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.


సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ కు చెందిన ఎమ్మార్వో  స్వామి రైతు పట్ల చాలా నీచంగా మాట్లాడాడు.  రైతు తన సమస్యల పరిష్కారం కోసం ఆఫీస్ చుట్టు తిరుగుతున్నాడు.  వ్యవసాయ భూమి, జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఎమ్మార్వోను, అధికారులను కలిసి మొరపెట్టుకున్నాడు. కానీ అధికారులు మాత్రం  అస్సలు పట్టించుకోలేదు. 

ఇటీవల జరిగిన ఆఫీస్ మీటింగ్ లో అనేక మంది తమ సమస్యలను ఎమ్మార్వోతో చెప్పు కుంటున్నారు. సదరు రైతును చూసిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి చాలా నీచంగా మాట్లాడాడు. రైతన్నను చూసి నువ్వు ఇంకా చచ్చిపోలేదా..?.. బ్రతికే ఉన్నావా..?.. పురుగుల మందు తాగలేదా..?..అంటూ చాలా అవహేళనగా మాట్లాడాడు.  

దీనికి రైతు అసలే వ్యవసాయ భూమి, జీవనోపాధి కోల్పోయే పరిస్థితిలో ఉన్నట్లు చెప్పాడు. తన సిట్యువేషన్ చూస్తే నవ్వొస్తుందా సర్ అంటూ.. మాట్లాడగా.. అవును వస్తది.. బరాబర్ చనిపోయే సిట్యువేషన్ వస్తదంటూ ఎమ్మార్వో సమాధానం ఇచ్చాడు. 

ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది. తనపై గజ్వేల్ ఎమ్మార్వో స్వామి చేసిన వ్యాఖ్యలకు రైతన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES