Abhijeet dipke grand mother dies in Maharashtra: దేశ రాజధాని ఢిల్లీ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో అట్టుడుకుతుంది. ఇప్పటికే పోలీసులు వేలాదిగా జంతర్ మంతర్ చుట్టు భద్రత చేపట్టారు. పోలీసులు ఇంటర్నేట్ సేవలు నిలిపివేశారు. ఎక్కడికక్కడ బారికెడ్లు, ఇనుప చువ్వలను ఏర్పాటు చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆరంచెల్లో బారికెడ్లను ఏర్పాటు చేశారు. ఈక్రమంలో పలు చోట్ల కాక్రోచ్ నిరసన కారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. బారికెడ్లను తోసుకుంటూ దూసుకునిపోయారు. దీంతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఇంట పెనువిషాదం చోటుచేసుకుంది.
అభిజిత్ దీప్కే నానమ్మ సావిత్రి బాయి మహారాష్ట్రలోని హింగోలిలో కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి వయసు రీత్యా, తీవ్ర అనారోగ్య సమస్యలతో సావిత్రిబాయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సావిత్రిబాయి ఈ రోజు మరణించారు.
ఇదిలా ఉండగా, అభిజిత్ దీప్కే తల్లిదండ్రులు అనితా, భగవాన్ దీప్కే ప్రస్తుతం ఛత్రపతి సంభాజీనగర్‌లో ఉన్నారు. అయితే వారి నివాసం బయట పోలీసు సిబ్బందిని మోహరించారు. మృతి వార్త తెలియగానే, వారు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు హింగోలికి బయలుదేరారు. మరోవైపు
ఈ క్లిష్ట సమయంలో అభిజిత్ దీప్కేను హింగోలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తారా..?.. లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మరోవైపు సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాపై కాక్రోచ్ ల నిరసనలతో ఢిల్లీ అట్టుడుకుతుంది.