• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /ఇంకా పెళ్లి చేసుకోలేదా? అని సూటిపోటి మాటలు.. పొరుగింటి వ్యక్తిని కొట్టి చంపిన 45 ఏళ్ల వ్యక్తి!

ఇంకా పెళ్లి చేసుకోలేదా? అని సూటిపోటి మాటలు.. పొరుగింటి వ్యక్తిని కొట్టి చంపిన 45 ఏళ్ల వ్యక్తి!

Viral News: 45 ఏళ్లు దాటినా ఇంకా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదని.. అనడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వ్యక్తి.. తన పొరిగింటి వృద్ధుడిని విపరీతంగా కొట్టి చంపాడు.. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 10, 2026, 04:29 PM IST|Updated: Oct 10, 2026, 04:31 PM IST
joinshare
ఇంకా పెళ్లి చేసుకోలేదా? అని సూటిపోటి మాటలు.. పొరుగింటి వ్యక్తిని కొట్టి చంపిన 45 ఏళ్ల వ్యక్తి!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
BC Reservations: స్థానిక ఎన్నికలపై ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం.. బీసీ రిజర్వేషన్లు ఎన్ని కేటాయించారంటే?

BC Reservations: స్థానిక ఎన్నికలపై ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం.. బీసీ రిజర్వేషన్లు ఎన్ని కేటాయించారంటే?

2

Elon Musk Starlink: భారతదేశంలోకి ఎలాన్ మస్క్ 'స్టార్‌లింక్' ఇంటర్నెట్ వస్తే లాభమా? నష్టమా?

3

ఇంకా పెళ్లి చేసుకోలేదా? అని సూటిపోటి మాటలు.. పొరుగింటి వ్యక్తిని కొట్టి చంపిన 45 ఏళ్ల వ్యక్తి!

4

Abhijeet Dipke: కాక్రోచ్ చీఫ్ అభిజిత్ దీప్కే ఇంట పెను విషాదం.. ఏంజరిగిందంటే..?..

5

Abhijeet Dipke Arrest: అభిజీత్ దీప్కే అరెస్ట్ కోసం మహిళా పోలీసులే ఎందుకొచ్చారు? దీని వెనుక పక్కా ప్లాన్ ఉందా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Viral Telugu News: సాధారణంగా ఒక వ్యక్తి సమాజంలో లేదా ఇరుగుపొరుగు వారి మధ్య జరిగే విమర్శలు, ఎత్తి పొడుపు మాటలు ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో తెలిపే ఒక విషాదకరమైన ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. 45 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు?.. అంటూ ఇంటి పక్కన వ్యక్తి పదేపదే వేసిన ప్రశ్నకు తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి.. సదరు వృద్దుడిపై దాడి చేసి ప్రాణాలు తీశాడు. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లోని దక్షిణ తపనూలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.. 45 ఏళ్ల పార్లిందుంగన్ సిరేగర్‌ అనే వ్యక్తి.. 60 ఏళ్ల అస్గిమ్ ఇరియాంతో అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఇరుగుపొరుగున కొన్ని సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నారు.. స్థానిక పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ఇరియాంతో తరచూ సిరేగర్‌ను ఉద్దేశించి .. నీకు 45 ఏళ్లు దాటినా ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు?.. అని ఎత్తిపొడుస్తూ మాట్లాడేవాడట.. ఈ మాటలు తన మనసును తీవ్రంగా గాయపరిచాయని.. అవమానతోనే తాను తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు నిందితుడు విచారణలో పోలీసులకు వెల్లడించిన్నట్లు తెలుస్తోంది..

ఈ సమయంలోనే సహనం కోల్పోయిన సిరేగర్.. ఇరియాంతోపై తీవ్రస్థాయిలో దాడికి చేశాడట.. తీవ్ర గాయాలపాలైన ఇరియాంతోను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితుడు సిరేగర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి అధికారులు మీడియాతో తెలిపారు..

అయితే.. కేవలం పెళ్లి గురించిన అన్న మాటలు మాత్రమే కాకుండా.. గతంలో వీరిద్దరి మధ్య ఇతర చిన్నపాటి వివాదాలు కూడా జరిగాయని.. స్థానిక స్పష్టం చేస్తున్నాయి.. ఒకరి పెరట్లోకి మరొకరి కోళ్లు రావడంతో.. గతంలోనూ ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు జరిగాయని తెలుస్తోంది. పాత విభేదాలకు తోడు.. వ్యక్తిగత జీవితంపై నిరంతరం చేసిన ఎత్తిపొడుపు మాటలే.. ఈ హత్యకు దారితీసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే, ఈ ఘటన ఎప్పుడో జరిగినప్పటికీ.. ఇప్పుడు మాత్రం భారత్‌లో ఈ న్యూస్‌కి సంబంధించిన పోస్టులు వైరల్‌ అవుతూ వస్తున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News
Viral News