• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /మద్యం వినియోగంలో తెలంగాణ రికార్డు.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం..!!

మద్యం వినియోగంలో తెలంగాణ రికార్డు.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం..!!

Telangana Alcohol Consumption: తెలంగాణ రాష్ట్రంలో మద్యం వినియోగం ఏ స్థాయిలో ఉందో కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 తాజా రిపోర్ట్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో 15ఏండ్లు..అంతకంటే ఎక్కువ వయస్సున్న పురుషుల్లో ఏకంగా 43.9 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు ఈ సర్వే గణాంకాలు వెల్లడించాయి.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 04, 2026, 12:14 PM IST|Updated: Oct 04, 2026, 12:15 PM IST
joinshare
మద్యం వినియోగంలో తెలంగాణ రికార్డు.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం..!!
Image Credit: Telangana Alcohol Consumption

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
2027 Long Weekends: 2027లో ఉద్యోగులకు తీవ్ర నిరాశ..ప్రధాన పండుగలన్నీ వారాంతపు సెలవుల్లోనే!

2027 Long Weekends: 2027లో ఉద్యోగులకు తీవ్ర నిరాశ..ప్రధాన పండుగలన్నీ వారాంతపు సెలవుల్లోనే!

2

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఆశలు..

3

బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీలో కీలక మలుపు..

4

మందు బాబులకు షాక్.. రేపటి నుంచి తెలంగాణలో లిక్కర్ షాప్స్ బంద్..?

5

Venu Swamy: అన్నీ విప్పేసుకున్న.. సన్నీలియోన్‌పై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై నెట్టింట దుమారం.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Alcohol Consumption: తెలంగాణ రాష్ట్రంలో మద్యం వినియోగం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6 గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులలో ఏకంగా 43.9 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు తేలింది.దేశంలోని ఇతర రాష్ట్రాల గణాంకాలతో పోల్చి చూస్తే తెలంగాణలో మద్యపానం చేసే వారి శాతం అత్యంత ఎక్కువగా ఉండటం గమనార్హం. కేవలం వైన్ షాపులు, డిపోల ద్వారా జరిగే మద్యం విక్రయాల రాబడిని మాత్రమే కాకుండా.. మొత్తం జనాభాలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో శాతాల వారీగా లెక్కించి NFHS-6 ఈ ప్రామాణిక నివేదికను రూపొందించింది.

జిల్లాల వారీగా పరిశీలించినట్లయితే.. జనగాం జిల్లాలో పురుషుల మద్యం వినియోగం అత్యధికంగా 61.6 శాతంగా నమోదు అయ్యింది. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి 56.6 శాతం, వరంగల్ రూరల్ 56.5శాతంతో ఉన్నాయి. యాదాద్రి భువనగిరి 54.1 శాతం, సిద్ధిపేట 52.5శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి వంటి పట్టణ ప్రాంతాలు తక్కువ శాతం నమోదు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పట్టణ వ్యత్యాసం కూడా స్పష్టంగా కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో 46.6శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నట్లు వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో ఈ శాతం 36.6గా ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో పోల్చినట్లయితే 10.3 శాతం పాయింట్ల అధిక వినియోగం నమోదు అయ్యింది. ఈ వ్యత్యాసం తెలంగాణ మొత్తం గణాంకాలపై ప్రభావం చూపుతున్నట్లు సర్వే వివరాలు సూచిస్తున్నాయి.

తెలంగాణలో మహిళల గణాంకాలు కూడా జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడిన మహిళల్లో 7.1 శాతం మంది మద్యం తాగుతున్నారని NFHS-6 పేర్కొంది. గ్రామీణ మహిళల్లో ఈ శాతం 8.6 కాగా, పట్టణ మహిళల్లో ఇది 2.8 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో 1.1 శాతం మహిళలు మద్యం తాగుతున్నారు. మొత్తం మీద, ఈ గణాంకాలు తెలంగాణలో మద్యం వినియోగం రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతిగా లేదని చూపిస్తున్నాయి. హైదరాబాద్‌లో అత్యధిక మద్యం దుకాణాలు ఉన్నప్పటికీ, వినియోగ శాతం జిల్లాల జాబితాలో అట్టడుగున ఉంది. అయితే, జనగాంతో సహా అనేక జిల్లాల్లో నమోదైన శాతం 50కి పైగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం, మద్యం వినియోగం ప్రాంతాన్ని బట్టి మారుతుందని చూపిస్తుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News