SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Telangana: తెలంగాణలో 35 మంది జూనియర్ లెక్చరర్ల తొలగింపు.. అసలు కారణం ఏమిటంటే..?..

Junior lecturers suspends in telangana: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదట కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేసిన కొంత మంది 2023లో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. అయితే, వారి విద్యార్హత పత్రాలపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆ సర్టిఫికెట్లను సంబంధిత విశ్వవిద్యాలయాలకు వెరిఫికేషన్ కోసం పంపించింది.

Written By Inamdar Paresh
Published: Oct 06, 2026, 02:31 PM IST | Updated: Oct 06, 2026, 02:38 PM IST
Image Credit: Telangananews(file)
Join

Fake certificate scam in Telangana: తెలంగాణలో ఇటీవల కొంత మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు నకిలీ సర్టిఫికెట్లను వాడుకుంటున్నారు. ఫెక్ డిగ్రీలు, పీజీల సర్టిఫికేట్లు మార్కెట్ లలో వివిధ యూనివర్సీటీల పేరిట జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో కాలేజీలు, యూనివర్సీటీల పేరిట ఫెక్ సర్టిఫికెట్ల దందాకు తెరతీశారు. ఈ క్రమంలో తెలంగాణలో కొంత మంది జూనియర్ లెక్చరర్లు నకిలీ సర్టిఫికేట్లు పెట్టుకుని ఉద్యోగాలు పొందిన కొంత మంది అడ్డంగా బుక్కైయ్యారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కొంత మంది మొదట కాంట్రాక్టు లెక్చరర్లుగా జాయిన్ అయ్యారు.ఆ తర్వాత క్రమంగా  వీరందరినీ 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. అయితే, వారి విద్యార్హత పత్రాలపై ఫిర్యాదులు అందాయి. దీంతో   ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆ సర్టిఫికెట్లను సంబంధిత విశ్వవిద్యాలయాలకు వెరిఫికేషన్ కోసం పంపింది. ఈ క్రమంలో పరిశీలన అనంతరం ఆ సర్టిఫికెట్లు అన్ని కూడా ఫెక్ అనే విషయం వెలుగులోకి వచ్చింది.

 ఈ క్రమంలో  విద్యాశాఖ సదరు లెక్చరర్లకు షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. లెక్చరర్ల వివరణ సరిగ్గా లేక పోవడంతో వారిని  సర్వీస్ నుంచి తొలగిస్తూ  తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో రాజన్న-సిరిసిల్ల జిల్లా నుంచి ఆరుగురు ఉండగా, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల నుంచి ముగ్గురు లెక్చరర్లు ఉన్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి ఇద్దరు లెక్చరర్లు ఉన్నారు. మరో ఎనిమిది జిల్లాల నుంచి ఒక్కొక్కరు  ఈ జాబితాలో ఉన్నారు. అయితే గతంలో కూడా ఇదే ఆరోపణలపై సుమారు 10 మంది లెక్చరర్లను తొలగించినట్లు తెలుస్తొంది.

 ప్రస్తుతం మరో 320 మంది లెక్చరర్ల సర్టిఫికెట్లను కూడా వెరిఫికేషన్ కోసం యూనివర్సిటీలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహరంపై బోర్డ్ ఆఫ్ ఇంటర్నీడియట్ మాత్రం సీరియస్ గా ఉంది. ఈ నకిలీ పత్రాలను పరిశీలించి, ధ్రువీకరించిన అధికారులపై సైతం కఠిన చర్యలు తీసుకొవాలని పలువురు కోరుతున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES