SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం.. ఆశావాహులకు నిరాశ..

Telangana Cabinet Expansion Late: కొండా సురేఖ బర్తరఫ్‌తో తెలంగాణలో మూడు క్యాబినేట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దసరా వరకు ఖాళీగా ఉన్న వాటిని సామాజిక సమీకరణాల దృష్ట్యా భర్తీ చేసి వచ్చే ఎన్నికలకు వెళ్లాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. ఇప్పటికే క్యాబినేట్‌లో ఉన్న ఒకరిద్దరిని తొలిగించి వారి ప్లేస్‌లో కొత్త వారిని తీసుకొవాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ క్యాబినేట్ విస్తరణ డిసెంబర్‌కు వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి.దీంతో క్యాబినేట్ బెర్త్ పై ఆశలు పెట్టుకున్న వారిపై నీళ్లు జల్లినట్టైయింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Sep 26, 2026, 08:42 AM IST | Updated: Sep 26, 2026, 08:46 AM IST
Image Credit: Telangana Cabinet Exapasion (ZEE News Telugu/Source)
Join

Telangana Cabinet Will Expads at December: తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం  కానుందని సమాచారం. ఈ ఏడాది చివరకు  వరకు మంత్రి వర్గ విస్తరణ లేనట్లుగా తెలుస్తోంది. ఈ మంత్రి వర్గ విస్తరణ ఎన్నికల టీంగా ఉండాలనే అభిప్రాయంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.  దీనికి తోడు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్‌ ఈ నెల 18న ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. దీంతో ఆమె స్థానంలో మరొకరిని ఇన్‌ఛార్జిగా నియమిస్తారని ప్రచారం జరిగినా, అది ఇంకా నియమించలేదు.

క్యాబినెట్‌ బెర్త్‌పై ఆశావహుల ఆశలపై  నీళ్ళు చల్లిన అధిష్ఠానం..

కొత్తగా నియమించేవారికి రాష్ట్రంలోని పరిస్థితి అర్థం కావడానికి సమయం పట్టవచ్చన్న భావనలో కాంగ్రెస్‌ హై కమాండ్‌ వుంది.  కొండా సురేఖ బర్తరఫ్‌ తరువాత క్యాబినెట్‌లో ఖాళీల సంఖ్య 3 కు చేరింది.  దీంతో పాటు ఇప్పటికే క్యాబినేట్‌లో ఉన్న ఇద్దరు ముగ్గురిని తొలిగించి వారిన పార్టీ పదవు ఇచ్చే అవకాశం ఉంది. వారి ప్లేస్‌లో కొత్త ముఖాలను తీసుకొని పూర్తి టీమ్‌లో నెక్ట్స్ ఎలక్షన్స్‌కు వెళ్లాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్‌‌గా ఉంది.

ఈ ఏడాది ఆఖరు వరకు వేచి చూసే ధోరణిలో కాంగ్రెస్‌ హై కమాండ్‌..

ఇక క్యాబినేట్‌లో బెర్త్ చిన్న కోమటిరెడ్డి ఇప్పటికే తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. గత ఎన్నికల సమయంలో మంత్రి పదవి హామితోనే ఆయన బీజేపీ నుంచి తిగిరి కాంగ్రెస్ గూటికి వచ్చారు. ఆల్రెడీ మంత్రివర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉండటం ఆయనకు పదవి రాకుండా అడ్డు పడుతుంది. ఆయన్ని పార్టీలో కీలక పదవి కట్టబెట్టి .. ఆయన ప్లేస్‌లో రాజగోపాల్ రెడ్డిని తీసుకునే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. మరోవైపు సామాజిక సమీకరణాల దృష్ట్యా.. ఈ సారి మంత్రివర్గంలో ఎస్టీ, బీసీ మహిళా కోటాలో పలువురికి మంత్రి పదవులు వరించే అవకాశాలున్నాయి.

రేవంత్‌ రెడ్డి క్యాబినెట్‌లో ప్రస్తుతం ఖాళీగా వున్న 3 స్థానాలు ..

తెలంగాణ అసెంబ్లీలో 119 సభ్యుల దృష్ట్యా మంత్రివర్గంలో సీఎం సహా 18 మందికి ఛాన్సెస్  ఉంది. కొండా సురేఖ రాజీనామాతో తెలంగాణలో మంత్రుల సంఖ్య ముఖ్యమంత్రితో కలిపి 15 మంది ఉన్నారు. అందులో ఎక్కువగా అగ్రవర్ణాలైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే ఎక్కువ క్యాబినేట్ పోస్టులు  దక్కాయి. రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెట్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి సహా నలుగురు ఉన్నారు. ఈ సారి మంత్రివర్గ విస్తరణలో సామాజిక వర్గాల వారీగా పదవులు కేటాయించనున్నట్టు తెలుస్తుంది.  ఈ కోవలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీతో పాటు మహిళకు  ఎంపిక చేసే ఛాన్సెస్ ఉన్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES