SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vinayaka Chavithi: గణనాథుడి సేవలో రాజకీయ ప్రముఖులు.. విఘ్నాలు తొలగించాలని పూజలు

Telangana CM And Ministers Other Political Leaders Offers Special Pooja To Lord Ganesh For Ganesh Chaturthi: వినాయక చవితి ఉత్సవాలు తెలంగాణలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విఘ్నాలు తొలగించే వినాయకుడిని రాజకీయ నాయకులు పూజించారు. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు. వినాయక చవితి విశేషాలు ఇలా ఉన్నాయి.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 14, 2026, 11:03 PM IST | Updated: Sep 14, 2026, 11:23 PM IST
Image Credit: Ganesh Utsav Political Leaders
Join

Ganesh Chaturthi: వినాయక నవరాత్రి ఉత్సవాలు చవితి రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని తెలంగాణలోని గల్లీ గల్లీలో వినాయకుడు ప్రతిష్టాపన పొందాడు. ప్రతి హిందూ లోగిలి వినాయకుడి పూజలతో పులకరించింది. గణనాథుడిని ప్రతిష్టించిన భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేసిన అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. దీంతో తెలంగాణలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఆ విశేషాలు ఇలా ఉన్నాయి.

శాసన మండలి చైర్మన్ పూజలు
గణేష్ పండుగ సందర్భంగా నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు గుత్తా తెలిపారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 'విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గణేష్ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే గొప్ప పండుగ. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయి' అని వివరించారు.

'వినాయకుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, రైతులు, కార్మికులు, యువత, మహిళలు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నా' అని గుత్తా సుఖేందర్‌ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగిపోయి, వారు చేపట్టే ప్రతి మంచి కార్యం విజయవంతం కావాలని ఆ గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యనిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్లగొండ పట్టణంలోని రామాలయం వద్ద ఏర్పాటుచేసిన వినాయక మండపంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.. ప్రజలందరికీ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు లభించి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతిసౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి
వినాయక చవితి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి గణపతి పూజా చేశారు. తన సతీమణి, కుమార్తె, అల్లుడు, మనవడితో కలిసి ముఖ్యమంత్రి వినాయకుడికి పూజలు చేశారు.

వినాయక చవితి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌ బేగంబజార్‌లోని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంలో ఏర్పాటుచేసిన గణేష్ ఉత్సవాల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గణేశుడికి పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి కోరారు. గణనాథుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించినట్లు వెల్లడించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES