SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలి: రేవంత్‌ రెడ్డి

Telangana CM Demands Bharat Ratna For Former PM Manmohan Singh: తెలంగాణ ప్రజల తరఫున మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తెలంగాణ సీఎం డిమాండ్‌ చేశారు. భారతదేశం గర్వించదగ్గ జాతిరత్నం మన్మోహన్ సింగ్ అని అభివర్ణించారు. ఎన్నో పదవులకు వన్నె తెచ్చారని తెలిపారు.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 26, 2026, 09:27 PM IST | Updated: Sep 26, 2026, 09:29 PM IST
Image Credit: Source: Telangana CMO Twitter
Join

Manmohan Singh Statue: భారతరత్న పురస్కారాన్ని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. భారతదేశం గర్వించదగ్గ జాతిరత్నం మన్మోహన్ సింగ్ అని తెలిపారు. మన్మోహన్‌ స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నట్లు పేర్కొన్నారు. రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా పదవులకు వన్నె తెచ్చారని కొనియాడారు.

హైదరాబాద్‌ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్‌లో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ విగ్రహంతోపాటు స్మారక పార్క్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కీలక ప్రసంగం చేశారు. '1991లో పీవీ హయాంలో ఆర్ధిక మంత్రిగా దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి కోలుకునేలా చేశారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్' అని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన  సంస్థలు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు. అలాంటి ఈ ప్రాంతంలో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సముచితం అని భావించినట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు.

'హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో కలిపి స్వాతంత్య్రం అందించిన ఘనత తొలి ప్రధాని నెహ్రూ, వల్లభాయ్ పటేల్‌ది. దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన ఘనత సోనియా గాంధీ, ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తూ ఆయన చేసిన సంతకాన్ని ఇక్కడ పొందుపరిచాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. మన్మోహన్‌ సింగ్‌ ఎన్నో సరళీకృత విధానాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ చట్టం, భూసేకరణ, పునరావాస చట్టం 2013 తీసుకొచ్చిన ఘనత సోనియా, మన్మోహన్ సింగ్‌ది అని వివరించారు.

'భూమిలేని పేదలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని పునరావాస చట్టం ద్వారా హక్కు కల్పించారు. మౌన మునిలా దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్. ఆయన జ్ఞాపకం ఢిల్లీలో ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టం' అని రేవంత్ రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. కొన్ని సమయాల్లో రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఆయన పేరుతో ఢిల్లీలో ఒక విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నామని తెలిపారు.  ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా లోక్ సభలో ప్రస్తావించాలని ఎంపీలకు సూచిస్తున్నానని చెప్పారు.

'దేశ శ్రేయస్సు కోసం ఎన్నో చట్టాలను అమలు చేసిన మౌన ముని. భారతరత్న పురస్కారం ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరం? దేశం గర్వించదగిన జాతిరత్నాన్ని రాజకీయపరమైన అంశాల నేపథ్యంలో గుర్తించకపోవడం విషాదకరం. కొన్ని సందర్భాలు, అంశాల్లో రాజకీయాల గురించిన ఆలోచన చేయడం ఎంతమాత్రం తగదు' అని తెలంగాణ సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు చేస్తూ బిల్లుపై డాక్టర్ మన్మోహన్ సింగ్ పెట్టిన సంతకాన్ని ఈ పార్క్‌లో నిక్షిప్తం చేశామని వెల్లడించారు.

ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, ఆర్థిక మాజీ సలహాదారు మోహన్ గురుస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, నవీన్ యాదవ్ పాల్గొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES