• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Telangana CM: 'పండుగ సాయన్న చనిపోయి వందేళ్లు దాటినా నేటికీ ఆయన పాటలు వినిపిస్తున్నాయి'

Telangana CM: 'పండుగ సాయన్న చనిపోయి వందేళ్లు దాటినా నేటికీ ఆయన పాటలు వినిపిస్తున్నాయి'

Panduga Sayanna Birth Anniversary: కేసీఆర్‌, అంతకుముందు ప్రభుత్వాలు అమలుచేసిన మంచి పథకాలు అమలు చేస్తూనే రెట్టింపు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలంగాణ సీఎం ప్రకటించారు. ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత తనదని తెలిపారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 22, 2026, 01:47 PM IST|Updated: Oct 22, 2026, 02:58 PM IST
joinshare
Telangana CM: 'పండుగ సాయన్న చనిపోయి వందేళ్లు దాటినా నేటికీ ఆయన పాటలు వినిపిస్తున్నాయి'
Image Credit: Revanth Reddy Speech

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
దీపావళి పూజలో పాత మట్టి ప్రమిదలు వాడొచ్చా? 3 నిమిషాల్లో కొత్తవాటిలా మార్చే అద్భుతమైన హ్యాక్స్!

దీపావళి పూజలో పాత మట్టి ప్రమిదలు వాడొచ్చా? 3 నిమిషాల్లో కొత్తవాటిలా మార్చే అద్భుతమైన హ్యాక్స్!

2

చెట్టు మీద 10 పిట్టలు ఉన్నాయి.. వేటగాడు తుపాకీతో కాల్చి 1 పిట్టను పడగొట్టాడు.. చెట్టు మీద ఎన్ని పిట్టలు ఉంటాయి?

3

‘జైలర్ 2’ మూవీపై అల్లు అర్జున్ మార్క్ రివ్యూ..

4

Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. వదినపై దాడి చేసిన మరిది..అసలు విషయం ఇదే.!.

5

Vikarabad Anganwadi Jobs: తెలంగాణలో అంగన్‌వాడీ పోస్టులకు ఆఖరి ఛాన్స్! 264 ఉద్యోగాలు, రెండే రోజులు గడువు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana CM Speech: తెలంగాణ ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత తనదని ముఖ్యమంత్రి ప్రకటించారు. ముదిరాజ్‌లకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. కేసీఆర్‌.. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు అమలుచేసిన మంచి పథకాలు అమలు చేస్తూనే రెట్టింపు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ప్రకటించారు. వందేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టిందని.. కుల గణన చేసినందునే ఈ రోజు బలంగా ప్రతి కులం తమ గళం వినిపిస్తోందని రేవంత్‌ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్‌లో గురువారం జరిగిన పండగ సాయన్న జయంతి సభలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'ముదిరాజులు విశ్వసనీయమైన వారు. భూస్వాములు తన భూమిని ఆక్రమించుకునప్పుడు పండుగ సాయన్న ఎదురుతిరిగారు. నిజాం హయాంలో దొరలు పేదల భూమి ఆక్రమిస్తుంటే పేదలకు అండగా పండగ సాయన్న నిలిచాడు' అని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. దొరలకు వ్యతిరేకంగా దళాన్ని పండుగ సాయన్న ఏర్పాటుచేసి.. ప్రజలకు ధాన్యం పంచడమే కాదు, పేద ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేసిన ఘనత ఆయనది' అని ప్రశంసలు కురిపించారు.

'సాయన్నను నిజాం పోలీసులు అరెస్టు చేస్తే నాటి వనపర్తి మహారాణి పెద్ద ఎత్తున నిధులు చెల్లించి సాయన్నను విడిపించారు. పండుగ సాయన్నను అన్యాయంగా హత్య చేశారు. ఆయన చనిపోయి వందేళ్లు దాటినా నేటికీ నాట్లు, కోతల సమయంలో పండుగ సాయన్న పాటలు వినిపిస్తున్నాయి' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.బ్రిటిష్ హయాంలో కుల గణన చేయగా.. వందేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టిందని.. కుల గణన చేసినందునే ఈ రోజు బలంగా ప్రతి కులం తమ గళం వినిపిస్తోందని చెప్పారు.

'ఎవరైనా కుల గణనలో తమ జనాభా తక్కువగా ఉందని భావిస్తే పూర్తి వివరాలు ఇస్తే లెక్కలు సవరిస్తాం. లెక్కలు లేకపోవడంతో ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏకు మార్చలేకపోయారు. ఈ అంశంపై వచ్చే మంత్రివర్గంలో చర్చిస్తాం. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయిస్తాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై ఇతర కులాలకు ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. జఠిలమైన ఎస్సీ వర్గీకరణను అమలు చేశామని గుర్తుచేశారు. బీసీ కుల గణన చేపట్టామని తెలిపారు.

'పీసీసీ అధ్యక్షుడిని కాగానే శ్రీహరి ముదిరాజ్‌ను డీసీసీ ప్రెసిడెంట్‌గా నియమించా. శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చా, మంత్రిని చేశా. నీలం మధుకి ఎంపీ టికెట్ ఇచ్చా. ముదిరాజ్‌లకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచిస్తున్నా. ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత నాది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. నాడు ఎన్టీఆర్ రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తే నేడు సన్న బియ్యం ఇస్తున్నమని చెప్పారు.

'గత ప్రభుత్వాలు చేసిన సంక్షేమానికి రెట్టింపు చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాం.. ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాం. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్‌, కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అమలుచేసిన మంచి పథకాలు అమలు చేస్తూనే రెట్టింపు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం' అని తెలంగాణ ముఖ్యమంత్రి వివరించారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్నల చరిత్రను కనుమరుగు చేశారని.. ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్యల విగ్రహాలను ఆవిష్కరిస్తామని ప్రకటించారు. పండుగ సాయన్న, గద్దర్, అందెశ్రీ వంటి వారు జీవితమంతా సమాజం కోసమే జీవించారు అని తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Revanth Reddy
Hyderabad
Telangana News
Telugu News