• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తెలంగాణలో పెరిగిన చలి.. కోహిర్‌లో అత్యల్పంగా 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత..

తెలంగాణలో పెరిగిన చలి.. కోహిర్‌లో అత్యల్పంగా 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత..

Telangana Cold Waves: తెలంగాణ వాసులను చలి చంపేస్తోంది. గత కొన్ని వారం పది రోజుల నుంచి చలి తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రజలు ఉదయాన్నే వెచ్చని చలి మంటలు కాచుకుంటుకున్నారు. అంతేకాదు ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో కనిష్ఠానికి పడిపోయాయి. రాబోయే రోజుల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితం కానున్నాయి.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 17, 2026, 10:10 IST|Updated: Nov 17, 2026, 10:13 IST
joinshare
తెలంగాణలో పెరిగిన చలి.. కోహిర్‌లో అత్యల్పంగా 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత..
Image Credit: Telangana Cold Waves (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Weather Update: తెలంగాణ వ్యాప్తంగా  చలి తీవ్రత అంతకంతకు పెరుగుతూ పోతుంది. మరో రెండు మూడు రోజుల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా  ఉత్తర, ఈశాన్య భారతాల నుంచి వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అతి తక్కువగా నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి జనవరి 18 వరకు ఉండే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.

కోహిర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత..

ఇక తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో  11.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మొయినాబాద్‌లో 11.8, గాంధారిలో 12.2 డిగ్రీలు, నేరడిగొండలో 13. గండీడ్‌లో 13.1 డిగ్రీలు, సిర్పూర్‌ ( యు )లో 13.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యయి. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో 13.4 డిగ్రీలుగా నమోదైంది.జీహెచ్ఎంసీ, ఎంఎన్‌సీ, సీఎంసీలోని  పలు  వేర్వేరు  ప్రాంతాల్లో  వేర్వేరుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.


భారీగా పొగమంచు.. 
ఉమ్మడి ఆదిలాబాద్ లో చలి తీవ్రగా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా  ఆసిఫాబాద్ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ చలి ప్రభావం అధికంగా ఉంది. పొడి వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగనుండగా, ఉదయం వేళల్లో పొగమంచు కమ్మేస్తుండటంతో ప్రయాణాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. కార్లలో వెళ్లే వాళ్లు లైట్లను డిప్ చేస్తూ వెళ్లాలని సూచిస్తున్నారు.  చలి తీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్వెటర్లు, మఫ్లర్లు ఉపయోగించాలని కోరుతున్నారు.  బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాతావరణ మార్పుల వల్ల ఈ నెల 20 తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Weather
Telangana News
Telugu News