BM Sandeep Kumar: 'రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉంది. గతంలో ఇక్కడ పని చేసిన ఏఐసీసీ ఇంచార్జ్‌లు పార్టీని బలోపేతం చేయడంలో చాలా కృషి చేశారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రిగా చేసేందుకు మరింత కష్టపడి మనం పని చేయాలి' అని కాంగ్రెస్ ఇన్‌చార్జ్ సందీప్ కుమార్ తెలిపారు. 'సోనియాగాంధీ రాసిన బిలాంగింగ్ పుస్తకం దేశంలో చాలా ప్రాధాన్యత వచ్చింది. సోనియా చేసిన త్యాగాలు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీతో బలిదానాలు ఈ దేశంలో ప్రజల మనసులో ఉన్నాయి' అని వివరించారు. 'బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మనం తిప్పికొట్టాలి. మనం అంత కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలి' అని బీఎం సందీప్ కుమార్ ఆదేశించారు.
హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో నూతన ఏఐసీసీ ఇన్‌చార్జి ఎంబీ సందీప్ కుమార్ కీలక దిశానిర్దేశం చేశారు. మంత్రులు, కాంగ్రెస్ నాయకులకు సలహాలు ఇచ్చారు. 'తెలంగాణలో అంత కలిసికట్టుగా పని చేయడంతో గత ఎన్నికల్లో మనం రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగాం. గతంలో మనం ఐకమత్యంగా పని చేయడంతో 64 ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి వచ్చాం. తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో విజయం సాధించాం. అధికారంలోకి వచ్చిన మనం ఇక్కడ అద్భుతమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేస్తున్నాం' అని బీఎం సందీప్ కుమార్ తెలిపారు. 'దేశంలో ఎల్‌నినోతో తీవ్రమైన కరవు ఏర్పడింది. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కరవు పరిస్థితులు అధిగమిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం' అని చెప్పారు.
'కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తగినంత సహాయ సహకారాలు అందించడం లేదు. వారు సహాయ నిరాకరణ చేసినా కూడా మనం కరువును ఎదుర్కొంటు రాష్ట్రంలో అన్ని రకాలుగా ప్రజల అవసరాలు తీరుస్తున్నాం' అని సందీప్ కుమార్ తెలిపారు. ఇప్పుడు మనం మరింత ఉత్సహంతో పని చేసి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీతో మరిన్ని అధిక స్థానాలు సంపాదించాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నూతన ఏఐసీసీ ఇన్‌చార్జి బి. సందీప్ కుమార్ అధ్యక్షతన పీఏసీ (పొలిటికల్ అఫైర్స్ కమిటీ) అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించగా.. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ ఎలక్షన్ కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.