• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Telangana Employees DA: ఉద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది ఎంత? దేశంలో ఇక్కడే చాలా తక్కువ!: @DNA విత్ భరత్!

Telangana Employees DA: ఉద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది ఎంత? దేశంలో ఇక్కడే చాలా తక్కువ!: @DNA విత్ భరత్!

Telangana Employees DA Update: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల కోసం వెచ్చిస్తున్న రాబడి శాతం గణనీయంగా తక్కువగా ఉందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా జీతాలు ఇస్తోందనే ప్రచారంలో వాస్తవం లేదని, రాష్ట్రం తన రాబడి రసీదుల్లో కేవలం 35 శాతం మాత్రమే ఉద్యోగుల కోసం ఖర్చు చేస్తోందని జీ తెలుగు న్యూస్ ఎడిటర్ శ్రీ భరత్ సుస్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక భారానికి ఉద్యోగుల జీతాలు కారణం కాదని, విచ్చలవిడిగా అమలు చేస్తున్న ఉచిత పథకాలు, పరిపాలనా దుబారా ఖర్చులే ప్రధాన కారణమని 'డీఎన్ఏ విత్ భరత్' డిబేట్ కార్యక్రమంలో విశ్లేషించారు.

Written ByHarish Darla
Published: Sep 24, 2026, 09:39 IST|Updated: Sep 24, 2026, 09:42 IST
joinshare
Telangana Employees DA: ఉద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది ఎంత? దేశంలో ఇక్కడే చాలా తక్కువ!: @DNA విత్ భరత్!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
జుట్టు కుదుళ్లు బలపడాలంటే ఇది బెస్ట్ టిప్.. హోమ్‌మేడ్ మెంతుల హెయిర్ ప్యాక్ పూర్తి విధానమిదే!

జుట్టు కుదుళ్లు బలపడాలంటే ఇది బెస్ట్ టిప్.. హోమ్‌మేడ్ మెంతుల హెయిర్ ప్యాక్ పూర్తి విధానమిదే!

2

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

3

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

4

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

5

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Employees DA Update: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం చాలా తక్కువ శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం వినియోగిస్తుందని జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ తెలిపారు. రాష్ట్ర రాబడి రసీదుల (Revenue Receipts) ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం ఏ రాష్ట్రం ఎంత శాతం ఖర్చు చేస్తుందనే అంశంపై వెలువడిన గణాంకాల ప్రకారం తెలంగాణ అత్యంత పొదుపుగా వ్యయం చేస్తోందని ఆయన అన్నారు.

వివిధ రాష్ట్రాల వ్యయాల పోలిక..
హిమాచల్ ప్రదేశ్: ఈ కొండ ప్రాంత రాష్ట్రం తన రాబడి రసీదులు రూ. 40,872 కోట్లలో అత్యధికంగా 81 శాతం (రూ. 33,266 కోట్లు) ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే ఖర్చు చేస్తోంది. ఈ అధిక వ్యయం వల్ల అక్కడ గ్రూప్-1 స్థాయి ఉద్యోగుల జీతాల్లో 25 శాతం కోత విధించాల్సి వచ్చింది.

కేరళ: కేరళ రాష్ట్రంలో తన రూ. 1,24,861 కోట్ల ఆదాయంలో 55 శాతం (రూ. 69,425 కోట్లు) ఉద్యోగుల కోసం కేటాయిస్తోంది.

ఆంధ్రప్రదేశ్, పంజాబ్: పొరుగు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తన రూ. 1,67,676 కోట్ల రాబడిలో 51 నుండి 53 శాతం (రూ. 89,000 కోట్లు) ఉద్యోగుల కోసం వెచ్చిస్తోంది. అలాగే పంజాబ్ కూడా తన రాబడిలో 53 శాతం (రూ. 54,968 కోట్లు) ఖర్చు చేస్తోంది.

కర్ణాటక, తమిళనాడు: కర్ణాటక రూ. 2,63,428 కోట్ల ఆదాయంలో 42 శాతం (రూ. 1,22,789 కోట్లు), తమిళనాడు రూ. 2,82,000 కోట్ల ఆదాయంలో 39 శాతం (రూ. 1,10,000 కోట్లు) ఖర్చు చేస్తున్నాయి.

మధ్యప్రదేశ్, తెలంగాణ: మధ్యప్రదేశ్ 38 శాతం ఖర్చు చేస్తుండగా, తెలంగాణ అత్యంత తక్కువగా 35 శాతం (రూ. 59,195 కోట్లు) మాత్రమే వెచ్చిస్తోందని ఈ గణాంకాల ద్వారా వెల్లడైంది.

ఉచిత పథకాల ప్రభావం.. 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రాబడి ఆదాయం రూ. 1,67,000 కోట్లతో సమానంగా ఉన్నప్పటికీ, ఏపీ కంటే తెలంగాణ 18 శాతం తక్కువ వ్యయం చేస్తోంది. తెలంగాణలో మద్యం విక్రయాలు, జీఎస్టీ ద్వారా రాబడి మెరుగ్గా ఉంది. టీచర్లు, డాక్టర్లు, పోలీసులు అందించే రక్షణ, సేవలు సమాజానికి అత్యంతావశ్యకమైనవి కాబట్టి ఉద్యోగుల వ్యయాన్ని తప్పుపట్టడం సరికాదని జీ ఎడిటర్ భరత్ పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 20,000 కోట్ల రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ వంటి పథకాలు, వీఐపీల కాన్వాయ్‌ల దుబారా ఖర్చులే అసలైన ఆర్థిక సమస్య అని స్పష్టమవుతోంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Employees
DA Hike
Telugu News