• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Telangana Employees PRC: తెలంగాణ ఉద్యోగులకు భారీ షాకింగ్ న్యూస్..2027లో కూడా పీఆర్సీ కష్టమే! ప్రభుత్వం గట్టి ప్లానింగ్?

Telangana Employees PRC: తెలంగాణ ఉద్యోగులకు భారీ షాకింగ్ న్యూస్..2027లో కూడా పీఆర్సీ కష్టమే! ప్రభుత్వం గట్టి ప్లానింగ్?

Telangana Employees PRC Update: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, వివిధ డిమాండ్లపై స్పష్టత రాకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆవేదన, నిరాశ వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రెండు కరువు భత్యం (DA) వాయిదాలు ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ, పే రివిజన్ కమిషన్ (PRC) నివేదిక సమర్పణలో జాప్యం, సీపీఎస్ (CPS) రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉందని జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ శ్రీ భరత్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది అనగా 2027 ఏప్రిల్ 1 వరకు ఉద్యోగులకు ఊరటనిచ్చే ఎలాంటి ప్రకటన రాబోదని ఆయన వివరణ ఇచ్చారు.

Written ByHarish Darla
Published: Sep 25, 2026, 09:53 PM IST|Updated: Sep 25, 2026, 10:01 PM IST
joinshare
Telangana Employees PRC: తెలంగాణ ఉద్యోగులకు భారీ షాకింగ్ న్యూస్..2027లో కూడా పీఆర్సీ కష్టమే! ప్రభుత్వం గట్టి ప్లానింగ్?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Employees PRC Update: రెండు డీఏల ప్రకటన, ఉద్యోగుల ఇతర డిమాండ్లు ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం రెండు డీఏలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఇవి దసరా పండుగ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపినప్పటికీ, ఆర్థికపరమైన నిర్ణయం కావడం వల్ల క్యాబినెట్ ఆమోదం లభించిన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే, డీఏ అనేది ఉద్యోగుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని, దాన్ని పండుగ కానుకగా చూడకూడదని జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ అన్నారు.

ఉద్యోగుల ఆందోళన కేవలం డీఏల కోసమే కాదని, కొత్త పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, డీఎస్సీ 2003 అభ్యర్థులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయడం, ఉపాధ్యాయులకు టెట్ (TET) నిబంధనల సడలింపు వంటి పలు నాన్-ఫైనాన్షియల్ డిమాండ్ల సాధన కోసం కూడా ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయని ఎడిటర్ భరత్ అన్నారు.

పీఆర్సీ నివేదికలో జరుగుతున్న జాప్యం గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నియమించిన పీఆర్సీ కమిషన్ దాదాపు 1085 రోజులకు పైగా (మూడేళ్లు) గడుస్తున్నా తన నివేదికను పూర్తి చేయకుండా కొనసాగుతోందని ఎడిటర్ భరత్ గుర్తు చేశారు. గతంలో 5 శాతం మధ్యంతర ఉపశమనం (IR) ఇచ్చినప్పటికీ, పూర్తిస్థాయి నివేదిక రాకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన తెలిపారు.

భారత రాజ్యాంగ నిర్మాణానికి పట్టిన సమయం (2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు) కంటే కూడా ఈ పీఆర్సీ రిపోర్ట్ సమర్పణకే ఎక్కువ సమయం పడుతుండటం గమనార్హం. సీఎస్ లేఖ రాసి 15 రోజులు గడిచినా దీనిపై ఎలాంటి పురోగతి లేదని జీ ఎడిటర్ భరత్ తెలిపారు. ప్రస్తుత పరిణామాలను బట్టి గమనిస్తే.. కొత్త పీఆర్సీ అమలు అనేది 2027 ఏప్రిల్ నాటికి కూడా వచ్చే దాఖలాలు కనిపించడం లేదని భరత్ విశ్లేషించారు.

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిని వివరించగా.. ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ఎక్కువ నిధులు సరిపోతున్నాయని సమావేశంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్ బకాయిల విడుదల నిలిచిపోయిందని జీ ఎడిటర్ భరత్ సుస్పష్టం చేశారు.

జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) నిధులు పొందడానికి 1.5 నుండి 2 ఏళ్లు పడుతుండటంతో, విధుల్లో ఉన్న ఉద్యోగులు కూడా ముందస్తుగా ఆందోళన చెంది జీపీఎఫ్ నిధులను విత్ డ్రా చేసుకుంటున్నారు. కాలయాపన వ్యూహాలు రెండు డీఏలు ప్రకటించి రాబోయే ఆరు నెలల వరకు ఉద్యోగుల నిరసనలు లేకుండా చూడాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోందని ఎడిటర్ భరత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా సీపీఎస్ రద్దుపై అధ్యయన కమిటీలు వేసి ఇతర రాష్ట్రాల పర్యటనల పేరుతో ఎన్నికల వరకు సమయాన్ని దాటవేసే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషణలు పేర్కొంటున్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Employees
DA Hike
Telugu News