OPS కోసం రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సామూహిక సెలవు..!!
TSCPSEU: పాత పెన్షన్ పథకాన్ని (OPS) తిరిగి అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (CPS) ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ నిరసనను ప్రభుత్వానికి బలంగా తెలియజేసేందుకు ఈ నెల 17వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా సామూహిక సెలవు పాటించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ వెల్లడించారు.
TSCPSEU: పాత పెన్షన్ పథకాన్ని (OPS) తిరిగి అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (CPS) ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ నిరసనను ప్రభుత్వానికి బలంగా తెలియజేసేందుకు ఈ నెల 17వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా సామూహిక సెలవు పాటించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ వెల్లడించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఈ భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
మొత్తం 2.60లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల్లో అత్యవసర సేవలకు 45వేల మందిని మినహాయించి.. మిగతా 2.15లక్షల మంది సామూహిక సెలవుల్లో పాల్గొనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి 3ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు సామూహిక సెలవులు పాటిస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో భారీగా ధర్మ దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే 1.5లక్షల మందికి పైగా ఉద్యోగులు సామూహిక సెలవు కోసం దరఖాస్తులు ఇవ్వడం కూడా తమ ఉద్యమానికి లభిస్తున్న విశేష స్పందనకు నిదర్శనమన్నారు.
అంతకుముందు ఆగస్టు 23న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిర్వహించిన 'జన జాగరణ సభ' తీర్మానాలను యూనియన్ నేతలు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజుకు అందజేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వరి శ్రీకాంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళలోనూ పాత పెన్షన్ పథకాన్ని తిరిగి అమలు చేయాలన్నదే ఉద్యోగుల ప్రధాన ఆకాంక్షగా ఉందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా సీపీఎస్ రద్దు దిశగా తక్షణమే అడుగులు వేయాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రతి సీపీఎస్ ఉద్యోగి తమ నెలవారీ వేతనంలో 11.5 శాతం ఆర్థిక భారాన్ని మోస్తున్నప్పటికీ, పదవీ విరమణ అనంతరం గౌరవప్రదమైన పెన్షన్ కానీ, సరైన వైద్య భద్రత కానీ లభించకపోవడం తీవ్ర అన్యాయమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన ఈ సామూహిక సెలవు ఉద్యమానికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ నిరసనలో భాగంగా నల్లగొండలో నిర్వహించనున్న 'ధర్మదీక్ష' కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి స్వయంగా పాల్గొననున్నారు.
Also Read: