SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Dasara Holidays: దసరా సెలవులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని స్కూళ్లు, కాలేజీలకు వార్నింగ్.. అసలు విషయం ఇదే..

Telangana govt on schools and colleges: ఈ నెల 10 నుంచి అక్టోబర్ 22, 23 వరకు మొత్తం 13 రోజుల పాటు తెలంగాణలో విద్యాసంస్థలకు తెలంగాణ సర్కారు సెలవులు ప్రకటించింది. దీంతో ఇప్పటికే విద్యార్థులు తమ సొంతూర్లకు వెళ్లేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Written By Inamdar Paresh
Published: Oct 05, 2026, 09:12 AM IST | Updated: Oct 05, 2026, 09:21 AM IST
Image Credit: cmrevanthreddy(file)
Join

TG Govt on schools and Colleges holidays: రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగ సందడి కన్పిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో  దసరా  పండగను ఎంతో వేడుకగా  జరుపుకుంటారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను కన్నుల పండగలా జరుపుకుంటారు. అయితే తెలంగాణ ప్రభుత్వం  ఇప్పటికే అన్నిస్కూళ్లు, కాలేజీలకు ముందస్తుగా దసరా సెలవులను ప్రకటించింది.

ఈ నెల 10 నుంచి అక్టోబర్ 22, 23 వరకు మొత్తం 13 రోజుల పాటు తెలంగాణలో విద్యాసంస్థలకు
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అదేవిధంగా.. జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 21 వరకు సెలవులు ఉండగా.. తిరిగి అక్టోబర్ 22న కాలేజీలు తిరిగి తెరుచుకుంటాయి. 

ఇక పాఠశాలలుమరల అక్టోబర్ 23న తిరిగి ప్రారంభంకానున్నాయి. అయితే స్కూళ్లు, కాలేజీలకు సెలవుల ప్రకటనపై తెలంగాణ ప్రభుత్వం ఆయా కాలేజీలకు, స్కూళ్లకు కీలకఆదేశాలు జారీ చేసింది. ప్రతి విద్యాసంస్థ హాలిడేస్ షెడ్యూల్ ను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.

 ముఖ్యంగా సెలవు రోజుల్లో ఆన్ లైన్ క్లాసులు, ప్రైవేటు క్లాసులు పెట్టడం వంటివి చేయకూడదని తెల్చి చెప్పింది. ఏ విద్యాసంస్థ అయిన రూల్స్‌కు విరుద్ధంగా స్పెషల్ క్లాసులు లేదా ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తే.. ఆయా స్కూళ్లు, పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ఏపీలో దసరా సెలవులు విషయానికి వస్తే..

ఇక ఏపీలోనూ ప్రభుత్వం  స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులకు అక్టోబర్ 10 నుంచి 21 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES