• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Army Engineers For Kaleshwaram: కాళేశ్వరం కోసం రంగంలోకి ఆర్మీ..ఢిల్లీలో పాగ వేసిన తెలంగాణ ప్రభుత్వ బృందం!

Army Engineers For Kaleshwaram: కాళేశ్వరం కోసం రంగంలోకి ఆర్మీ..ఢిల్లీలో పాగ వేసిన తెలంగాణ ప్రభుత్వ బృందం!

Army Engineers For Kaleshwaram SLBC: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్. పాటీల్.. ఆర్మీ చీఫ్‌తో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ప్రక్రియతో పాటు అత్యంత క్లిష్టమైన ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ తవ్వకం పనుల పర్యవేక్షణకు ఆర్మీ ఇంజనీరింగ్ అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకోవడంపై జీ తెలుగు న్యూస్ 'బిగ్ డిబేట్ విత్ భరత్' కార్యక్రమంలో ఎడిటర్ శ్రీ భరత్ కీలక చర్చలు జరిపారు. అంతేకాకుండా, తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎత్తు పెంపు, రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర పర్యావరణ, జలసంఘం అనుమతులు సాధించడంపై లోతుగా విశ్లేషించారు.

Written ByHarish Darla
Published: Sep 30, 2026, 03:23 PM IST|Updated: Sep 30, 2026, 03:26 PM IST
joinshare
Army Engineers For Kaleshwaram: కాళేశ్వరం కోసం రంగంలోకి ఆర్మీ..ఢిల్లీలో పాగ వేసిన తెలంగాణ ప్రభుత్వ బృందం!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Army Engineers For Kaleshwaram SLBC: ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ గడ్డం వినోద్, ప్రభుత్వం నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌లతో కూడిన బృందం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్. పాటీల్‌ను కలిసింది. గతంలో మహారాష్ట్రతో 148 మీటర్ల ఎత్తులో ఒప్పందం ఉన్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని 152 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ (FRL) వద్ద చేపట్టేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేయబోతున్నట్లు జీ తెలుగు న్యూస్ ఎడిటర్ శ్రీ భరత్ విశ్లేషించారు. ఎత్తు పెంచడం ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని గ్రావిటీ పద్ధతిలోనే తరలించే అవకాశం ఏర్పడి, విద్యుత్ వ్యయం గణనీయంగా తగ్గుతుందని ఆయన వివరించారు.

కేంద్రానికి అనుమతుల విన్నపం..
రాష్ట్రంలోని ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టులైన పాలమూరు రంగారెడ్డి, సీతారామసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్లకు తక్షణమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఢిల్లీ వెళ్లిన బృందం కోరనుందని ఎడిటర్ శ్రీ భరత్ వెల్లడించారు.  దీంతో పాటు సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలసంఘం (CWC) వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులను వెంటనే క్లియర్ చేయాలని కేంద్ర మంత్రి సి.ఆర్. పాటీల్‌ను విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

రంగంలోకి ఆర్మీ ఇంజనీర్లు
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ బాధ్యతలతో పాటు ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ తవ్వకాలను పర్యవేక్షించేందుకు ఆర్మీ ఇంజనీరింగ్ అధికారులను కేటాయించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్మీ చీఫ్ జనరల్ ధీరేజ్ సేతును కలిసి కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరేజ్ సేతు పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో కలిసి చదువుకున్నారు. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఐఏఎఫ్ ఫైటర్ పైలట్‌గా సేవలు అందించడం విశేషం.

మంత్రి విజ్ఞప్తికి స్పందించిన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ డిప్యుటేషన్ కోసం ముగ్గురు అధికారుల పేర్లను సిఫారసు చేసింది. వారిలో కర్నల్ సత్యదేవ్ సింగ్, లెఫ్టినెంట్ కర్నల్ రంజిత్ మీనన్, లెఫ్టినెంట్ కర్నల్ బల్ల ఉన్నారు. మొత్తం 44 కిలోమీటర్ల పొడవైన ఎస్ఎల్బీసీ టన్నెల్‌‌లో ఇప్పటివరకు 35 కిలోమీటర్ల తవ్వకం పూర్తి కాగా, మిగిలిన 9 కిలోమీటర్ల క్లిష్టమైన పనులను డిప్యుటేషన్‌పై వచ్చే ఆర్మీ అధికారి ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. మరోవైపు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన సిఫారసుల ప్రకారం కాంక్రీట్ మరియు ఫౌండేషన్ పరీక్షల ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకున్నట్లు జీ తెలుగు న్యూస్ ఎడిటర్ శ్రీ భరత్ స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Revanth Reddy
Delhi