SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సామ, సర్వోత్తమ్..!!

Telangana Graduate MLC Elections: తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఫైనల్ చేసింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీ చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదంతో కేసీ వేణుగోపాల్ వీరి పేర్లను ప్రకటించారు. దామోదర రాజనర్సింహా, భట్టి విక్రమార్క నేత్రుత్వంలోని కమిటీ సిఫార్సులు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత అభ్యర్థుల ఎంపిక పూర్తి అయ్యింది. సామాజిక సమీకరణాల కంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నవారికే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమైనట్లే.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Sep 30, 2026, 09:08 AM IST | Updated: Sep 30, 2026, 09:10 AM IST
Image Credit: Telangana Graduate MLC Elections
Join

Telangana Graduate MLC Elections: తెలంగాణలో త్వరలోనే జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఫైనల్ చేసింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి సంబంధించి రాంరెడ్డి సర్వోత్తమర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డిని బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదంతో వీరి పేర్లను ఎంపిక చేసినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలు తెలిపారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి.. మాజీ మంత్రి రాం రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన సామ రామ్మోహన్ రెడ్డి గతంలో తెలంగాణ కాంగ్రెస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ విభాగం ఛైర్మన్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రసార మధ్యమాలు నిర్వహించే పలు చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ తరుణంలోనే పార్టీ, ప్రభుత్వ విధానాలను బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు సామ. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ మంత్రి దామోదర్ రాజనర్సింహుల నేత్రుత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు కాంగ్రెస్ హైకమాండ్ వీరి పేర్లను ఖరారు చేసింది. ఈ ఇద్దరు నేతలతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను కలిసిన అనంతరం వీరి పేర్లను ఖరారు చేశారు.

అభ్యర్థులను ప్రకటించే ముందు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌లతో ఫోన్‌లో మాట్లాడి వారి అభిప్రాయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ రెండు సీట్లను రెండు వేర్వేరు వర్గాలకు కేటాయించాలని భావించినప్పటికీ..  ప్రస్తుత ఎన్నికలు పార్టీ గుర్తుపై కాకుండా అభ్యర్థుల సంఖ్య ఆధారంగా జరుగుతాయి కాబట్టి, గెలిచిన అభ్యర్థులను మాత్రమే బరిలోకి దించాలని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సర్వోత్తమ్ బ్యాక్ గ్రౌండ్ ఇదే: 
రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఏఐసీసీ, పీసీసీ సభ్యుడు, బిజినెస్ మెన్, రైతు. 2012 నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు. సూర్యపేట నియోజకవర్గంలో పార్టీకి కీలక నేతగా వ్యవహరిస్తుండటంతోపాటు పార్టీతో సుధీర్ఘ అనుబంధం కలిగి ఉన్న నాలుగు తరాల కాంగ్రెస్ కుటుంబానికి చెందినవారు. సర్వోత్తమ్ తండ్రి దివంగత కాంగ్రెస్ నేత, మాజీ మంత్రిరాంరెడ్డి దామోదర్ రెడ్డి. సర్వోత్తమ్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్  ఇంజనీరింగ్ చేశారు. అమెరికాలో ఎంబీఏ, ఎంఐఎం పూర్తి చేశారు. ఎంబీఏ, బీఈలో గోల్డ్ మెడల్ సాధించారు. అమెరికా, కెనడా, లండన్ తోపాటు భారత్ లోనూ వ్రుత్తిపరమైన అనుభవం ఉంది.

అంచెలంచెలుగా ఎదిగిన సామ: 
2003లో ఎన్ ఎస్ యూఐ ద్వారా కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్ధానం ప్రారంభించారు సామ రామ్మోహన్ రెడ్డి. బీటెక్, ఎల్ఎల్ బీ విద్యార్హలతో హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన గతంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా, ఇండియన్ యూత్ కాంగ్రెస్ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ అధికార ప్రతినిధిగా సేవలందించారు. 2017లో రాష్ట్ర లీగల్ సెల్ వైస్ ఛైర్మన్ గా బాధ్యతలను నిర్వర్తించారు. 2019 నుంచి పీసీసీ అధికార ప్రతినిధిగా సేవలందిస్తూ.. 2024లో టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ గా నియమితులయ్యారు.  

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES