Telangana High Court: కారుణ్య నియామకాల ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం పొందేందుకు పెళ్లైన కుమార్తెలకు అర్హత లేదని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కుమారుడు, కుమార్తె మధ్య లింగ ప్రాతిపదికన వివపక్ష చూపించడం సరికాదని పేర్కొంది. విడాకులు తీసుకున్న లేదా భర్తను వదిలేసిన మహిళలకు మాత్రమే కారుణ్య నియామకాన్ని పరిమితం చేయడం సరికాదని సుప్రీకోర్టు సయారా ఖాతూన్ కేసులో ఇచ్చిన తీర్పును హైకోర్టు సైతం ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే తండ్రి మరణించిన 11 ఏండ్ల నుంచి కారుణ్య ఉద్యోగం కోసం పోరాటం చేస్తున్న కే. జ్యోతికి తగిన నియామక ఉత్తర్వులు జారీ చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థను హైకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఈమధ్యే తీర్పును వెలువరించారు. టీజీఎస్పీడీఏఎల్ లో అసిస్టెంట్ లైన్ మెన్ గా పనిచేసిన కే. రామక్రిష్ణారెడ్డి 2014లో మరణించారు. అదే సంవత్సరం ఆయన కూతురు కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆమె వివాహిత అనే కారణంతో అధికారులు జ్యోతి అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తండ్రి మరణించిన సమయంలో కుటుంబ వారసురాలుగా తల్లి, కుమారుడు, జ్యోతి ఉన్నారని.. ఆయన కుమారుడు లండన్ లో ఉంటున్నారు. దీంతో ఇక్కడ ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే జ్యోతి దరఖాస్తు చేసుకున్నారని కోర్టు గుర్తించింది.
జ్యోతి వివాహిత అనే కారణంతోనే ఉద్యోగం నిరాకరించడం సమజసం కాదని కోర్టు పేర్కొంది. సుదీర్ఘకాలంగా చేసిన అభ్యర్థనలను పరిగణలోనికి తీసుకోకుండా తిరస్కరించడం సరికాదని కోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జ్యోతికి వర్తించే అన్ని ప్రయోజనాలతోపాటు కారుణ్య నియామక ఉత్తర్వులు కూడా జారీ చేయాలని సంస్థను ఆదేశించింది కోర్టు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన 'సయారా ఖాతూన్' కేసు తీర్పును హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. విడాకులు తీసుకున్న లేదా భర్త వదిలేసిన మహిళలకు మాత్రమే కారుణ్య నియామకాలను పరిమితం చేయడం సరైన పద్ధతి కాదని తేల్చిచెప్పింది. ఆడపిల్ల వివాహమై వేరే కుటుంబానికి వెళ్లినప్పటికీ, తండ్రి మరణించిన సమయంలో ఆ కుటుంబ వారసురాలిగానే గుర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Also Read: