పండగపూట కూల్చివేతలొద్దు.. హైడ్రాకు హైకోర్టు ఆదేశం..
Telangana High Court Serious Warning To Hydraa: దసరా సెలవులైన ఈ నెల 17 నుంచి 25 వరకు కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని కలెక్టర్లు, హైడ్రాకు ఉత్తర్వులు జారీచేయాలని హైకోర్టు... రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది.
HYDRAA: హైదరాబాద్ మహా నగరంలో హైడ్రాకు పట్ట పగ్గాలు లేకుండా తనదైన శైలిలో దూసుకుపోతుంది. ప్రభుత్వ చెరువులను కబ్జా కోరల నుంచి విడిపిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటుంది. హైడ్రా దూకుడు అదే కొంత మంది నేతల విషయంలో చూసి చూడనట్టు పోవడంపై కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా హైడ్రా అస్మదీయుల విషయంలో ఓ రకంగా .. తస్మదీయుల విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారని కొంత మంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
సంబంధిత వ్యక్తులకు చట్టప్రకారం నోటీసులు జారీ చేయడానికి ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదని స్పష్టంచేసింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామంలో తన పట్టా భూమిలోని పశువుల కొట్టాన్ని కూల్చివేయడంతోపాటు భూమిని స్వాధీనం చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను సవాలు చేస్తూ ఎస్ లీలావతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్కు పాస్బుకులు, ధరణి పోర్టల్లోని వివరాలతోపాటు ఆమె భర్త పేరుతో విద్యుత్తు బిల్లులు కూడా ఉన్నాయని తెలిపారు.
కోర్టులకు సెలవులు ఉన్న టైంలో బాధితులకు చట్టప్రకారం పరిషారం పొందే అవకాశం కూడా ఉండదని తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. దసరా సెలవుల్లో కోర్టు విచారణలో ఉన్న ఆస్తులపై కఠిన చర్యలు తీసుకోకుండా కలెక్టర్లు, హైడ్రాకు ఉత్తర్వులు జారీచేయాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించారు.