• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు.. ఇంటర్ విద్యామండలి రద్దు?.. పాఠశాల విద్యలోనే ఇంటర్మీడియట్..!!

తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు.. ఇంటర్ విద్యామండలి రద్దు?.. పాఠశాల విద్యలోనే ఇంటర్మీడియట్..!!

Telangana Inter Board Merger: తెలంగాణ విద్యా వ్యవస్థలో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఉన్న వేర్వేరు పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య వ్యవస్థలను తొలగించి.. ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యా వ్యవస్థలో అంతర్భాగం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన ఇప్పుడు రూపుదిద్దుకుంటోంది.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Sep 29, 2026, 08:44 AM IST|Updated: Sep 29, 2026, 08:45 AM IST
joinshare
తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు.. ఇంటర్ విద్యామండలి రద్దు?.. పాఠశాల విద్యలోనే ఇంటర్మీడియట్..!!
Image Credit: Telangana Inter Board Merger:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Inter Board Merger:  తెలంగాణ విద్యా వ్యవస్థలో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది.  ఇప్పటి వరకు ఉన్న వేర్వేరు పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య వ్యవస్థలను తొలగించి.. ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యా వ్యవస్థలో అంతర్భాగం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన ఇప్పుడు రూపుదిద్దుకుంటోంది. 2025 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యతో అనుసంధానించాలన్న ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. విద్యా చట్టాలు, ఇంటర్మీడియట్ విద్యా బోర్డు చట్టం, ఉద్యోగ కేడర్, సేవా నిబంధనలు, ఇతర అంశాలను కూడా అధికారులు పరిశీలించారు. అయితే, 2026-27 విద్యా సంవత్సరానికి తగినంత సమయం లేకపోవడం, సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో, ఆ ఏడాదికి పాత పద్ధతిలోనే ఇంటర్మీడియట్ ప్రవేశాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల, విలీనం నుంచి తాను వెనక్కి తగ్గబోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేయడంతో ఈ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది.

ఇంటర్ విద్యా మండలి విలీనానికి ప్రభుత్వం చెబుతున్న అత్యంత కీలక కారణం ఇదే. పాఠశాలలో పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థి అదే పరిసరాల్లో ఇంటర్ చదివే అవకాశం లేకపోతే తదుపరి దశలో చదువు కొనసాగించడం కష్టమవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్ కళాశాలలు అందుబాటులో లేకపోవడం, రవాణా సమస్యలు, దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి, కుటుంబ ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతున్నాయి. బాలికల విషయంలో ఈ సమస్య మరింతగా కనిపిస్తుంది. ఈ కారణంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కొనసాగే విద్యా విధానాన్ని తీసుకురావాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని గతంలోనే ప్రకటించారు. మొదట హైదరాబాద్ ప్రధాన నగర ప్రాంతంలో దీనిని ప్రారంభించే ఆలోచనను కూడా వెల్లడించారు.


రాష్ట్రంలోని 74 మండలాల్లో ఇప్పటికీ ప్రభుత్వరంగ జూనియర్ కళాశాలలు అందుబాటులో లేవు. ప్రతి మండలా నికి కనీసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండాలని విద్యా విధానం సూచించింది. ఇక్కడే విలీనం వెనుక ఉన్న అసలు సవాల్ కనిపిస్తోంది. ఒకవైపు 12వ తరగతి వరకు సమగ్ర విద్యా వ్యవస్థ అంటున్నారు. మరోవైపు కొన్ని మండలాల్లో ఇంటర్ చదివేందుకు ప్రభుత్వ కళాశాలే లేదు. అందువల్ల విలీనం ఒక్కటే పరిష్కారం కాదని.. విలీనం తర్వాత ప్రతి ప్రాంతంలో విద్యార్థికి ఇంటర్ వరకు నాణ్యమైన విద్య అందేలా పాఠశాలలను బలోపేతం చేయడం, అదనపు తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, బోధనా సిబ్బంది, రవాణా సదుపాయాలు కల్పించడం కూడా అంతే కీలకమని చెబుతున్నారు.

ఈ నిర్ణయాన్ని కేవలం ఇంటర్మీడియట్ విద్యామండలిని మరో శాఖలో కలపడం అనే కోణంలో చూడటం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఇది జరిగితే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యను ఒక సమగ్ర దశగా నిర్వహించే విధానం బలపడుతుంది. ప్రస్తుతం తెలంగాణలో 10వ తరగతి తర్వాత ప్రత్యేకంగా ఇంటర్ మొదటి, రెండో సంవత్సరా లుగా విద్య కొనసాగుతోంది. జాతీయ విద్యా విధానం ప్రతిపాదిస్తున్న 5 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 4 నిర్మాణంలో 9-12 తరగతులు ఒకే మాధ్యమిక దశలోకి వస్తాయి. తెలంగాణలో ప్రస్తుతం 5-2-3-2 నిర్మాణానికి బదులుగా ఈ విధానానికి
దగ్గరవ్వడమే విలీనం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. తెలంగాణ విద్యా కమిషన్ కూడా పదో తరగతి, పన్నెండో తరగతులకు ఒకే విద్యా మండలి ఉండాలని సిఫారసు చేసింది. ఎస్ఎస్సీ బోర్డు, ఇంటర్మీడియట్ విద్యామండలిని ఒకే మండలిగా మార్చడం ద్వారా పరిపాలనా, విద్యా, పరీక్షలు, సమాచార వ్యవస్థల్లో ఉన్న ద్వంద్వాన్ని తగ్గించవచ్చని కమిషన్ అభిప్రాయప డింది. అంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వెనుక పరిపా లనా మార్పుతో పాటు విద్యావ్యవస్థ పునర్నిర్మాణంకూడా ఉందని అధికారులు చెబుతున్నారు.


ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడం అంటే ఇంటర్ విద్యనే రద్దు చేయడం కాదు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాల విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలు, పరీక్షలు, ధ్రువపత్రాలు, ఉన్నత విద్యలో ప్రవేశ అర్హతలు వంటి అంశాలను ప్రభుత్వం ఎలా కొనసాగి స్తుందన్నదే అసలు ప్రశ్న. 2026-27లో విద్యార్థుల ప్రవేశాలు పాత విధానంలోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించి నప్పుడు కూడా విలీనం వల్ల విద్యార్థుల విద్యా సంవత్సరానికి నష్టం జరగకుండా చూడటమే ప్రాధాన్యంగా పెట్టుకుంది. విలీనం చర్చలో మరో పెద్ద ప్రశ్న ఉద్యోగుల భవిష్యత్తుపైనే ఉందని అధికారులంటున్నారు. ఇంటర్మీడి యట్ విద్యామండలి, ౦డలి, విద్యాశాఖల్లో వేర్వేరు కేడర్లు, ఉద్యోగ బాధ్యతలు, సేవా నిబంధనలు ఉన్నాయి. వీటిని ఎలా సమన్వయం చేస్తారన్నదే ప్రధాన అంశం. ఇప్పటికే ప్రభు త్వం ఉద్యోగులు, అధ్యాపకుల జీతభత్యాలు, సేవా నిబం ధనలు, హక్కులకు ఎలాంటి భంగం కలగదని హామీ ఇస్తోం ది. విలీనానికి ఉద్యోగుల సహకారం పొందాలంటే వారి భయాలను తొలగించడమే మొదటి అడుగు కానున్నది.


పాఠశాల విద్యలో విలీనం చేసిన తర్వాత పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షలు ఒకే మండలి పరిధిలోకి వస్తా యా... ప్రస్తుత ఇంటర్ పరీక్షల విధానం కొనసాగుతుందా... పాఠ్యాంశాల్లో మార్పులు ఉంటాయా... వైద్య, ఇంజినీ రింగ్, ఇతర ప్రవేశ పరీక్షలకు విద్యార్థుల సిద్ధతపై ప్రభావం ఉంటుం దా... ఇవన్నీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంటర్ విద్యలో చిన్న మార్పు కూ డా లక్షలాది విద్యార్థుల ఉన్నత విద్యా అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పు విద్యార్థులపై ప్రయోగంగా కాకుండా, ముందస్తు ప్రణాళిక తో అమలు చేయాల్సిన అవసరం ఇక్కడే స్పష్టమవుతోంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Revanth Reddy
Telugu News