SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Telangana Liquor Sales: తెలంగాణకు 'లిక్కర్ కిక్కు'.. 13 ఏళ్లలో 200 శాతం పెరిగిన ఆదాయం

Telangana Liquor Sales Income 200 Percent Increase Within 13 Years: తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా ఎక్సైజ్‌ శాఖ నిలుస్తోంది. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి నేటి 13 ఏళ్ల వరకు భారీగా ఆదాయం పెరిగింది. దాదాపు 233 శాతం అధికంగా లిక్కర్‌ నుంచి ఆదాయం లభించింది. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఆదాయం ఇలా ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 06, 2026, 08:18 PM IST | Updated: Oct 06, 2026, 08:32 PM IST
Image Credit: Telangana Liquor Sales
Join

Liquor Sales Income: తెలంగాణ ఆదాయం రోజురోజుకు పెరుగుతోంది. ఇతర శాఖల్లో ఆదాయం అటు ఇటుగా ఉన్నా కానీ ఒక్క శాఖలో మాత్రం ఆదాయం పెరగడం తప్ప తరగడం లేదు. స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో నాటి నుంచి నేటి వరకు ఆదాయం దండిగా వస్తోంది. తెలంగాణ ఆర్థిక శాఖకు కల్పతరువుగా ఎక్సైజ్‌ శాఖ మారింది. మద్యం విక్రయాలు భారీగా పెరుగుతుండడంతో ఆదాయం అదే స్థాయిలో పెరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన 13 ఏళ్లలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 200 శాతం దాటింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి మద్యం ఆదాయం ఎలా ఉందో తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎక్సైజ్ శాఖ ఆదాయం భారీగా పెరుగుతూ వస్తోంది. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయిన అనంతరం తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా మద్యం మారింది. తెలంగాణ వచ్చిన అనంతరం 2015 నుంచి 16 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ శాఖ నుంచి రూ.12,706 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం ఏడాదికి ఏడాది పెరుగుతూ ఇప్పుడు 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరానికి మద్యం నుంచి రూ.40,209 కోట్లు ఆదాయం లభించింది. అంటే దాదాపు 233 శాతం ఎక్సైజ్‌ శాఖ నుంచి ఆదాయం పెరిగింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం ఎక్సైజ్‌ శాఖకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మద్యం ధరలు పెంచడం.. కొత్తగా అనుమతులు ఇవ్వడం వంటి వాటితో ఆదాయం పెరుగుతూ వస్తోంది.

స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. పెద్ద సంఖ్యలో వైన్స్‌ దుకాణాలు పెంచడం.. బార్ అండ్‌ రెస్టారెంట్లు సంఖ్య పెంచడంతోపాటు ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి కోసం వస్తుండడంతో తెలంగాణలో మద్యం విక్రయాలు పెరగడానికి కారణంగా నిలుస్తోంది. అంతేకాకుండా బార్లు, మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి దరఖాస్తు రుసుము పెంచడం వంటి వాటితో ఎక్సైజ్‌ శాఖకు భారీగా ఆదాయం పెరుగుతూ వస్తోంది.

12 ఏళ్లలో తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఆదాయం పరిశీలిస్తే గణాంకాలు ఇలా ఉన్నాయి.

2015–16: రూ.12,706 కోట్లు
2016–17: రూ.14,184 కోట్లు
2017–18: రూ.17,597 కోట్లు
2018–19: రూ.20,859 కోట్లు
2019–20: రూ.22,605 కోట్లు
2020–21: రూ.27,286 కోట్లు
2021–22: రూ.30,783 కోట్లు
2022–23: రూ.35,145 కోట్లు
2023–24: రూ.37,675 కోట్లు
2024–25: రూ.37,488 కోట్లు
2025–26: రూ.40,209 కోట్లు

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES