SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

New Pensions: కొత్త పింఛన్లపై అచ్చంపేటలో ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టిన సీతక్క!

Seethakka Hot Comments About New Pensions: కొత్త పింఛన్ల మంజూరుపై ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను అచ్చంపేట వేదికగా సీతక్క తిప్పికొట్టారు. ఒక్క పింఛన్‌ను కూడా తాము తొలగించలేదని ప్రకటించారు. ప్రతిపక్షాలు దురుద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 26, 2026, 22:20 IST | Updated: Nov 26, 2026, 22:25 IST
Image Credit: Source: Seethakka Twitter (X)
Join

Telangana New Pensions: అచ్చంపేట సభా వేదికగా మంత్రి సీతక్క కీలక ప్రసంగం చేశారు. కొత్త పింఛన్ల పంపిణీపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి దీటైన సమాధానం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హుల్లో ఒక్కరికి కూడాపింఛన్లను తొలగించలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 7 లక్షల 33 వేల పెన్షన్లను తొలగించారని: మరి వీటిని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. చనిపోయారని తొలగించారా? లేక రాజకీయ కక్షతో తొలగించారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తాము 4,89,233 మందికి నూతనంగా పెన్షన్లను మంజూరు చేశామని: అందరి ఖాతాల్లో పెన్షన్ మొత్తాలను జమ చేస్తున్నట్లు సీతక్క తెలిపారు. తాము ఇస్తున్న పెన్షన్లలో 70 శాతం పెన్షన్లు మహిళకే దక్కుతున్నాయని చెప్పారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమాన్ని ఆపడం లేదని: చెప్పింది చేసే ప్రభుత్వం తమదని ప్రకటించారు. ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని బీఆర్ఎస్, బీజేపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 'సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ ఇచ్చినా తట్టుకోలేకపోతున్నారు' అని వివరించారు.

'పెన్షన్ లబ్ధిదారుడైన భర్త మరణిస్తే వారి భార్యలకు వెంటనే పెన్షన్ మంజూరు చేస్తున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ఇన్‌స్టంట్ స్పోవ్స్ కింద 1,23,625 మందికి పెన్షన్లు మంజూరు చేశాం. అవి ఇవి కలిపితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా  6,12,858 పెన్షన్లు ఇచ్చాం' అని సీతక్క వెల్లడించారు. గత ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగానే పెన్షన్ కోసం అర్హులను గుర్తిస్తున్నామని స్పష్టత ఇచ్చారు. ఇంకా అర్హులైన వారికి పెన్షన్లు రాకపోతే దరఖాస్తు చేసుకుంటే అందరికీ ఇస్తామని ప్రకటించారు.

ఇందిరమ్మ చీరలు
'ఆడబిడ్డలకు ఆత్మగౌరవ కానుకగా ఇందిరమ్మ చీరలు అందిస్తున్నాం. ఈ దఫా కోటి మంది ఆడబిడ్డలకు కోటి చిలకపచ్చ రంగులో ఉన్న ఇందిరమ్మ చీరలను కానుకగా ఇస్తున్నాం. ఇందిరమ్మ చీరల రంగును కూడా బిజెపి రాజకీయం చేస్తోంది. ప్రకృతి ప్రేమికులైన ఆదివాసీలకు పచ్చ రంగు అంటే ఎంతో ఇష్టం. ములుగు-అచ్చంపేట దండకారణ్యం. ఎక్కడ ఆదివాసీలు ఉన్న వారి జెండా ఆకుపచ్చ రంగు జెండా. ఇందిరమ్మ చీరలను ముస్లిం రంగు అనడం బీజేపీ అజ్ఞానానికి అవివేకానికి నిదర్శనం' అని సీతక్క వివరణ ఇచ్చారు.

'మహిళలకు వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్నాము ఇప్పటికి 75 వేల కోట్లకు పైగా రుణాలను మహిళలకు ఇప్పించాం. మహిళలతో పెట్రోల్ బంకులు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఆర్టీసీ అద్దె బస్సులు నడిపిస్తున్నాం. వ్యాపారాలు కూడా మహిళలు నడపాలన్నదే తెలంగాణ ప్రభుత్వ సంకల్పం. అందుకే అమ్మకు అక్షరమాల ద్వారా చదువును మధ్యలో ఆపేసిన మహిళలకు చదువు చెప్పిస్తున్నాం' అని సీతక్క వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లను కూడా మహిళల పేరునే రిజిస్ట్రేషన్ చేస్తున్నామని.. ఇల్లు కట్టుకోవాలని మహిళలకు 80 పైసల వడ్డీకే మహిళా సంఘాల ద్వారా లోన్లు ఇప్పిస్తున్నట్లు గుర్తుచేశారు.

 'మహిళా సంఘ సభ్యులకు 10 లక్షల ప్రమాద బీమా రెండు లక్షల లోన్ బీమా కల్పిస్తున్నాం. రైతులు మైనార్టీలు మహిళలు, యువకులు, ఎస్సీ ఎస్టీల ప్రభుత్వం. ఆడబిడ్డ సంతోషంగా ఉంటేనే తెలంగాణ సంతోషంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో సరఫరాలో మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పిస్తున్నాం' అని సీతక్క వివరించారు. తెలంగాణ ప్రజలు పోరాట ప్రజలు తెగ గల్లా ప్రజలు త్యాగం చేసే ప్రజలు అని.. ప్రతిపక్షాల డ్రామాలు తెలంగాణ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES