IND A vs SL A Match Highlights: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న టీమిండియా ఏ జట్టు కీలక మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో దారుణ ఓటమిని చవిచూసింది. ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చిన శ్రీలంక 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించడమే కాకుండా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. లంకేయులు విధించిన భారీ స్కోర్‌ను ఛేదించలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా టోర్నీ నుంచి భారత ఏ జట్టు నిష్క్రమించింది.