SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కొత్త చేయూత పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారా?.. ప్రభుత్వం ప్రకటించిన తాజా అర్హతలు ఇవే!

తెలంగాణ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు చేయూత పెన్షన్ అందిస్తోంది. ఇప్పటికే కొత్త వారికి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. సీఎం రేవంత్‌ ప్రభుత్వం అందిస్తోన్న ఈ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ కార్మికులకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందిస్తోంది. అయితే ఈ పెన్షన్ పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. అవేంటో తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 19, 2026, 13:16 IST | Updated: Nov 19, 2026, 13:21 IST
Image Credit: Cheyutha Pension Eligibility
Join

Cheyutha Pension Eligibility: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న మీడియాతో తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలంలో ఆయన పర్యటించారు. అర్హులైన 642 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలను అందజేశారు. అర్హత ఉండి ఇంకా ఏడు రకాల పెన్షన్లు పొందని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అయితే, ఈ చేయూత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఎవరికి పింఛను లభిస్తుంది? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

చేయూత పింఛను కేవలం అర్హులైన వారికే ఇస్తారు. ప్రధానంగా వితంతువులు, ఒంటరి మహిళ, కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు, బీడీ, చేనేత కార్మికులకు ఈ పింఛను అందిస్తున్నారు.

చేయూత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే?
ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం,  నివాస ధ్రువీకరణ పత్రం, సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన, అర్హత నిర్ధారణ తర్వాత పెన్షన్ మంజూరు చేస్తారు.

చేయూత పింఛనుకు ఎవరు అర్హులు?
తెలంగాణ ప్రభుత్వం అందిస్తోన్న చేయూత పింఛనుకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రస్తుతం 57 ఏళ్లుపైబడిన వారు అర్హులు.  కుటుంబంలో కేవలం ఒక్కరికే పెన్షన్ మంజూరు చేస్తారు.

ఫ్లోరోసిస్‌ గ్రేడ్‌ II, III రోగులు, డయాలసిస్‌, బ్లడ్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నవారు కూడా ఈ చేయూత పింఛనుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అంతేకాదు 18 ఏళ్లు పైబడిన వితంతువులు, భర్త మరణ ధ్రువీకరణ పత్రం కూడా కలిగి ఉండాలి. ఒంటరి మహిళలు సపరేషన్‌ సంబంధించిన నిబంధనలు పూర్తి చేసి ఉండాలి.

వ్యాధులతో బాధపడుతున్నవారికి వయస్సు నిబంధన లేదు. అయితే, కనీసం 40 శాతం వైకల్యంతో బాధపడుతున్నవారు, 51 శాతం వినికిడి లోపంతో బాధపడుతున్నవారు అర్హులు.

50 ఏళ్లు పైబడిన చేనేత, గీత కార్మికులు కూడా అర్హులు, వారు కోఆపరేటివ్‌ సొసైటీలో సభ్యులు లేదా సంబంధిత సర్టిఫికేట్‌ కూడా కలిగి ఉండాలి.

డయాలసిస్‌ రోగులు ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స తీసుకుంటున్నవారు కూడా అర్హులు.

Read Also: 4.63 లక్షల మందికి కొత్త పెన్షన్లు.. ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసిన రేవంత్ సర్కార్!
 

వీళ్లకు పెన్షన్‌ రాదు..
ఈ చేయూత పథకం మూడు ఎకరాల కంటే ఎక్కువ తడి నెల లేదా 7.5 ఎకరాల పొడినెల కలిగిన వారికి రాదు. పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే వారి తల్లిదండ్రులకు కూడా ఈ పథకం వర్తించదు. అదేవిధంగా పిల్లలు వైద్యులు ఇతర ప్రొఫెషనల్స్‌లో వర్క్‌ చేస్తున్నవారు కూడా అర్హులు కాదు. ఆయిల్‌ మిల్స్‌, రైస్‌ మిల్స్‌, పెట్రోల్‌ పంప్‌ కలిగి ఉన్నవారు కూడా అనర్హులు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి పింఛను తీసుకునే వారు కూడా అర్హులు కాదు. కారు వంటి హెవీ వెహికల్స్‌ ఉన్న కుటుంబాలకు కూడా చేయూత పెన్షన్‌ లభించదు. ఇక గ్రామీణ ప్రాంతంలో ఇంటి ఆదాయం ఏడాదికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతంలో రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు కూడా పెన్షన్‌ లభించదు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES