• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Telangana RTC: ఊర్లకు పోయేందుకు ఫికర్‌ పడక్కర్లేదు.. దసరాకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త!

Telangana RTC: ఊర్లకు పోయేందుకు ఫికర్‌ పడక్కర్లేదు.. దసరాకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త!

Telangana RTC Good News To Passengers For Dusshera 2026: దసరా పండుగకు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. గ్రామాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. 7 వేల బస్సులు దసరా పండుగ కోసం ఏర్పాటుచేసినట్లు తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది.

Written By Ravi Kumar Sargam
Published: Oct 07, 2026, 10:15 PM IST|Updated: Oct 07, 2026, 10:15 PM IST
joinshare
Telangana RTC: ఊర్లకు పోయేందుకు ఫికర్‌ పడక్కర్లేదు.. దసరాకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త!
Image Credit: Telangana RTC

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Flipkart Big Billion Days: షాపింగ్‌ జాతర.. 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఉత్సవం

Flipkart Big Billion Days: షాపింగ్‌ జాతర.. 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఉత్సవం

2

Telangana RTC: ఊర్లకు పోయేందుకు ఫికర్‌ పడక్కర్లేదు.. దసరాకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త!

3

Jayalalitha: బిడ్డ పుడితే ఇబ్బందులు వస్తాయని భయపడ్డారా.. శరత్ బాబు గురించి జయలలిత సంచలన వ్యాఖ్యలు

4

World End: నవంబర్ 13న ప్రపంచం అంతమవుతుందా.. వైరల్ అవుతున్న పాత రీసెర్చ్..

5

Dakota Johnson: పడకగదిలో కొందరు దారుణంగా బిహేవ్ చేసేవారు.. స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dusshera 2026 Special Buses: దసరా పండుగ వాతావరణం ఇప్పటికే తెలంగాణలో ఏర్పడగా.. అందరూ ఎప్పుడెప్పుడు ఊర్లకు వెళ్లిపోదామా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త వినిపించింది. ఊర్లకు వెళ్లేందుకు ఇక ఏమాత్రం రందీ పడనవసరం లేదు. బస్సుల కోసం ఫికర్‌ పెట్టుకోనవసరం లేదు. ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటుచేసింది. దసరా పండుగ కోసం 7 వేల బస్సులు ఏర్పాటుచేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది.

దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) పూర్తి సన్నద్దత ప్రకటించింది. ఈ పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు నడుపుతామని.. అత్యధికంగా హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులు వేయగా.. అనంతరం కరీంనగర్ జోన్ నుంచి అత్యధిక బస్సులను ఆర్టీసీ ఏర్పాటుచేసింది. కరీంనగర్‌ రీజియన్‌ మొత్తం 3,533 బస్సులు, ఆదిలాబాద్ 431, నిజామాబాద్ 719, కరీంనగర్ 1175, వరంగల్ 530, ఖమ్మం 678, హైదరాబాద్ జోన్ నుంచి 2,155, మహబూబ్ నగర్ 645, మెదక్ 255, నల్గొండ 815, రంగారెడ్డి 440, గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి 1,312 ప్రత్యేక సర్వీసులను నడపబోతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది.

ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ లేకపోయినా రద్దీ ఉన్న మార్గాల్లో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన వెనక్కి తెప్పిస్తుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వాటిని ఆయా రూట్లలో బస్సులను నడిపించనుంది. ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఆ రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లుచేసింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తిరుగు ప్రయాణం రద్దీ ఉండే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.

సౌకర్యాలు
ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లు

ఛార్జీలు పెంపు
స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.5 వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ప్రతి ప్రధాన పండుగకు 1.5 వరకు టికెట్ ధరలను ఉమ్మడి కార్పొరేషన్గా ఉన్నప్పటి నుండి అమలు చేస్తుంది. టీజిఎస్ఆర్టీసీ ఏర్పడిన నాటి నుండి ప్రతి ప్రధాన పండుగకు దీనిని అమలు చేస్తామని ఆర్టీసీ వివరణ ఇచ్చింది. దసరా పండుగకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.5 వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి. ఈ నెల 9, 10, 16, 17 తేదీలతోపాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 25, 26 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి.

ఉచిత బస్సు
రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా దసరాకు నడిపే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్, స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది.

రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం
టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ను www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. దసరాకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లలో సంప్రదించాలని యాజమాన్యం సూచించింది.

రీజియన్ల వారీగా ప్రత్యేక బస్సులు
హైదరాబాద్ జోన్ 2,155
గ్రేటర్ హైదరాబాద్ జోన్ 1,312 
కరీంనగర్ 1,175
నల్గొండ 815
నిజామాబాద్ 719
ఖమ్మం 678
మహబూబ్ నగర్ 645
వరంగల్ 530
రంగారెడ్డి 440
ఆదిలాబాద్ 431
మెదక్ 255

స్టాపులు
ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ (నల్ల చెరువు), ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ కాలనీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Trending News