SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలు విడుదల..

RTC Union Election: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలు రిలీజ్ చేయకుండా కుట్రలు చేస్తున్నారంటూ పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠకు తెరతీసాయి.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 22, 2026, 09:28 AM IST | Updated: Oct 22, 2026, 09:30 AM IST
Image Credit: RTC Election Result (X/Source)
Join

TGS RTC Election Results: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో తెలంగాణ ఆర్టీసీలో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 10 యేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించారు. గుర్తింపు పొందిన యూనియన్లు ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. అక్టోబర్ 9న ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఈ నెల 17న వెలువడాల్సింది. కానీ విజయ దశమి పండగ పురస్కరించుకొని కాస్త ఆలస్యంగా ఫలితాలను కార్మిక శాఖ వెల్లడించింది.  

TSRTC ఎంప్లాయిస్ యూనియన్ ఘన విజయం..

ఈ ఎన్నికల్లో రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘంగా TSRTC ఎంప్లాయీస్ యూనియన్ ఘన విజయం సాధించింది. క్లాజ్-3 కింద మొత్తం ఎంప్లాయీస్ యూనియన్ 18 వేల 2 వందల 76 ఓట్లు సాధించి తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. 13 వేల 5 వందల 56 ఓట్లతో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్  రెండో స్థానంలో నిలిచింది.

పలు స్థానాల్లో TMU విజయం..

ఆర్టీసీ సంస్థలో మొత్తం 34 వేల 9 వందల 4 ఓట్లకు గాను రికార్డు స్థాయిలో 34 వేల 4 వందల 21 ఓట్లు పోల్ అవ్వడం విశేషం.  సికింద్రాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ రీజియన్లలో క్లాజ్-6 కింద TMU మెజారిటీ సాధించింది. ఖమ్మం, నల్గొండ రీజియన్లలో  TSRTC స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ సత్తా చాటింది.

రెండేళ్ల కాల పరమితి..

అలాగే మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ రీజియన్లతో పాటు హెడ్ ఆఫీస్‌లో వర్కర్స్ యూనియన్ ఆధిక్యం దక్కించుకుంది. అక్టోబర్ 9న సీక్రెట్ బ్యాలెట్.. 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు పూర్తి చేసారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన గుర్తింపు సంఘం కాలపరిమితి రెండేళ్ల పాటు కొనసాగుతుందని రిటర్నింగ్ అధికారి స్పష్టం చేసారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES