• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /India vs New Zealand Highlights: 'ఆ ఇద్దరికి చెప్పాల్సిన పనిలేదు, బాదడమే తెలుసు.. మ్యాచ్ చేతుల్లో పెట్టేస్తారు..'

India vs New Zealand Highlights: 'ఆ ఇద్దరికి చెప్పాల్సిన పనిలేదు, బాదడమే తెలుసు.. మ్యాచ్ చేతుల్లో పెట్టేస్తారు..'

IND vs NZ 1st T20 Match Highlights: న్యూజిలాండ్‌పై తొలి మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు. 220 పరుగుల కొండంత లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి జట్టుకు విజయాన్ని అందించారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఆల్‌రౌండర్ నమన్ ధీర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

Written ByAshok Krindinti
Published: Oct 22, 2026, 07:23 PM IST|Updated: Oct 22, 2026, 07:24 PM IST
joinshare
India vs New Zealand Highlights: 'ఆ ఇద్దరికి చెప్పాల్సిన పనిలేదు, బాదడమే తెలుసు.. మ్యాచ్ చేతుల్లో పెట్టేస్తారు..'
Image Credit: India vs New Zealand Highlights (Source: BCCI/X)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AP Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ తుఫాన్ ముప్పు..బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ జిల్లాలకు భారీ వర్షసూచన!

AP Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ తుఫాన్ ముప్పు..బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ జిల్లాలకు భారీ వర్షసూచన!

2

AP Inter Exams Schedule: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది! ఫిబ్రవరిలోనే మొదటి ఎగ్జామ్..తేదీల వివరాలు ఇవే!

3

Bank Charges: బ్యాంకు ఖాతాదారులకు భారీ షాక్‌.. ఛార్జీలు పెంచుతూ షాకింగ్‌ నిర్ణయం

4

India vs New Zealand Highlights: 'ఆ ఇద్దరికి చెప్పాల్సిన పనిలేదు, బాదడమే తెలుసు.. మ్యాచ్ చేతుల్లో పెట్టేస్తారు..'

5

వాట్సాప్ వీడియో కాల్‌లో శవాన్ని చూసి డెత్ సర్టిఫికెట్.. బుల్లెట్ మరణాన్ని గుండెపోటుగా మార్చి..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IND vs NZ 1st T20 Match Highlights: న్యూజిలాండ్‌ టూర్‌ను టీమిండియా విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో హై-వోల్టేజ్ పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ మెరుపు ఆరంభం ఇవ్వగా.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో నమన్ ధీర్ సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. దీంతో మరో రెండు బంతులు ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. 33 బంతుల్లోనే 67 పరుగులు చేసిన సంజూ శాంసన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ అయ్యర్ మాట్లాడుతూ.. పిచ్ పరిస్థితులు, బౌలర్ల ప్రదర్శనతో పాటు టాప్ ఆర్డర్ బ్యాటర్లు చూపించిన దూకుడుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

"మేము బౌలింగ్ ప్రారంభించిన సమయంలో పిచ్ కాస్త నెమ్మదిగా ఉన్నట్లు అనిపించింది. బంతి కొద్దిగా ఆగుతూ వచ్చింది. పైగా మేము వేయాల్సిన హార్డ్ లెంగ్త్‌ల కంటే కాస్త ముందుకు బంతులు వేశాం. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ డ్యూ ప్రభావం చూపడం మొదలైంది. దీంతో వికెట్ మరింత ఫ్లాట్‌గా మారి.. బంతి నేరుగా బ్యాట్‌పైకి చాలా బాగా రావడం మొదలైంది. అలా న్యూజిలాండ్‌కు ఊపు లభించి 220 పరుగుల భారీ స్కోరు సాధించారు. వారి పోరాటాన్ని మెచ్చుకోవాల్సిందే. అయితే 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు మాకు కూడా అలాంటి ధనాధన్ ఆరంభమే అవసరం. పవర్‌ప్లేలోని ఆరు ఓవర్లలోనే 80-85 పరుగులు రాబట్టడం నిజంగా తిరుగులేని ఆరంభం.." అని శ్రేయాస్ చెప్పాడు.

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌పై అయ్యర్ ప్రశంసల వర్షం కురిపించాడు. వాళ్లిద్దరికీ కావాల్సినంత అనుభవం ఉందని.. మ్యాచ్‌లో ఎలా ఆడాలో వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. ఏం చేయాలో వారికి స్పష్టంగా తెలుసు అని.. ఒక్కసారి వారు కుదురుకుంటే, ఆ ఊపును అలాగే ముందుకు తీసుకెళ్తారని అన్నాడు. ఈ మ్యాచ్ అందుకు నిదర్శనమని.. కానీ ప్రతిసారీ ఇలా జరగకపోవచ్చని చెప్పాడు. కానీ వారు ఒక్కసారి క్లిక్ అయితే మ్యాచ్‌ను మన చేతుల్లో పెడతారని.. ఆ తరువాత తాము వచ్చి ఇన్నింగ్స్‌ను నిలబెట్టి, మ్యాచ్‌ను విజయవంతంగా ముగించడమే తమ పని చెప్పుకొచ్చాడు.

"నమన్ జట్టులో ఉండటం వల్ల మాకు ఎన్నో ప్రత్యామ్నాయాలు లభిస్తాయి. ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాటర్లు అయినా.. కుడిచేతి వాటం బ్యాటర్లైనా.. ఈ గ్రౌండ్‌లో వచ్చి ఆ రెండు, మూడు కీలక ఓవర్లు బౌలింగ్ చేయడం మ్యాచ్ దిశనే మార్చేస్తుంది. ఇక ఈరోజు బ్యాటింగ్‌లో అతను ప్రదర్శించిన సంయమనం, ప్రశాంతత నిజంగా అద్భుతం. అతని బ్యాటింగ్ చూడటానికి చాలా ముచ్చటగా అనిపించింది." అని అయ్యార్ చెప్పాడు.

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
Team India
Sports News