• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తెలంగాణ వాతావరణ హెచ్చరిక.. నేడు, రేపు ఆ జిల్లాల్లో వర్షాలు.. మరోవైపు పెరగనున్న ఎండల తీవ్రత!

తెలంగాణ వాతావరణ హెచ్చరిక.. నేడు, రేపు ఆ జిల్లాల్లో వర్షాలు.. మరోవైపు పెరగనున్న ఎండల తీవ్రత!

తెలంగాణలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తూ, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తూర్పు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ఈ వర్షాలు తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కేవలం ఏపీలోని కోస్తా జిల్లాలకే వర్షాలు పరిమితమయ్యాయి. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని ఐఎండి తేల్చింది. అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ, అవి పెద్దగా ప్రభావం చూపలేవని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా మిగతా జిల్లాల్లో ఈ రోజు నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Written ByRenuka Godugu
Published: Sep 28, 2026, 09:26 AM IST|Updated: Sep 28, 2026, 09:29 AM IST
joinshare
తెలంగాణ వాతావరణ హెచ్చరిక.. నేడు, రేపు ఆ జిల్లాల్లో వర్షాలు.. మరోవైపు పెరగనున్న ఎండల తీవ్రత!
Image Credit: Telangana Weather Update

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

తెలంగాణలో మరొకసారి వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భూపాలపల్లి, ములుగు, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాయుగుండం వల్ల తూర్పు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ, ఆశించిన స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కాలేదు. కొన్ని చోట్ల 5 నుండి 15 సెంటీమీటర్ల వరకు వర్షం పడుతుందని అంచనా ఉన్నప్పటికీ, కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 10 నుండి 12 సెంటీమీటర్ల వరకు పడింది. తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినా పెద్దగా ప్రభావం చూపలేదు.

ప్రస్తుత పరిస్థితుల్లో భారీ వర్షాలు కురవాలని రైతులు కోరుకుంటున్నా, ఐఎండి ప్రకారం తెలంగాణలో భారీ వర్షాల అవకాశం లేదు. వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు వర్షాలు పడే అవకాశం ఉన్నా, అవి కురిసిన వెంటనే మళ్లీ ఎండలు పెరిగి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వానాకాలం గడిచినా, అనుకున్నంత స్థాయిలో రెయిన్ ఫాల్ నమోదు కాలేదు. ఆగస్టు చివరలో కురిసిన వర్షంతో కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షపాతం ఎక్కువగా ఉంది. తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్, ఎల్లంపల్లి వంటి ప్రధాన ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండలేదు. కేవలం ఎల్లంపల్లి ప్రాజెక్టు మాత్రమే నిండి గేట్లు ఎత్తాల్సి వచ్చింది. మేజర్ ప్రాజెక్టులు సగం స్థాయిలో కూడా లేకపోవడం వల్ల రాబోయే రోజుల్లో తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది.

 

వరుసగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు గడిచిపోవడంతో వానాకాలం దాదాపు ముగిసిందని, అక్టోబర్ నెల ప్రారంభం కాబోతోందని గమనించవచ్చు. వానాకాలంలో కురవాల్సినంత వర్షం కూడా పడలేదు. రాబోయే రోజుల్లో కురిసే వర్షాలు రైతులకు ఉపయోగపడే కంటే, పంటలు చేతికి వచ్చే సమయంలో కురిస్తే అకాల వర్షాలుగా మారి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి, ఇప్పుడు కురిసే వర్షాలు రైతులకు ఎంతో నష్టాన్ని కలిగిస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. వానకాలం పూర్తిగా ముగిసిన పరిస్థితుల్లో, రాబోయే రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ స్పష్టంగా చెబుతోంది. ఎల్ నినో ప్రభావం గణనీయంగా ఉండటం వల్ల, కేవలం తెలంగాణలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కాలేని పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో అకస్మాత్తుగా వర్షాలు కురిసి నష్టాలు సంభవించినప్పటికీ, ప్రధాన రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా వర్షపాతం నమోదు కాలేదు. వర్షాకాలంలో కేవలం తక్కువ వర్షాలతోనే పంటలు పండాయి, దీనివల్ల రాబోయే సీజన్‌లో ఎలాంటి పంటలు పండించుకోవాలి అనే భయం రైతుల్లో నెలకొంది. అందుకే, కనీసం ఈ రెండు మూడు రోజుల్లోనైనా భారీగా వర్షాలు పడాలని రైతాంగం కోరుకుంటోంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Weather