SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలంగాణలో ఎల్‌నినో ముప్పు ఉన్నా 75 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు?

Telangana Yasangi: ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నప్పటికీ.. సీజన్లో వ్యవసాయ విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది. సాగు విస్తీర్ణం ఏకంగా 70 నుంచి 75 లక్షల ఎకరాల్లో పంట సాగుతాయని అధికారులు ముందస్తు అంచనాలను రూపొందించారు.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 19, 2026, 12:40 PM IST | Updated: Oct 19, 2026, 12:42 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Telangana Yasangi: తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి వనరులు గణనీయంగా తగ్గే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ.. రాబోయే యాసంగి సీజన్లో వ్యవసాయ సాగు విస్తరణ ఏమాత్రం తగ్గకూడదని పట్టుదలతో వ్యవసాయ శాఖ ముందడుగు వేస్తూ వస్తోంది.  రాష్ట్ర సాధారణ సాగు విస్తీర్ణం 68.67 లక్షల ఎకరాలు కాగా.. ఈసారి ఏకంగా 70 నుంచి 75 లక్షల ఎకరాల్లో పంటను సాగవుతాయని అధికారులు ముందస్తు అంచనాలు రూపొందించడం విశేషం. వాతావరణ సవాళ్లు ఎదురవుతున్న సమయంలో వ్యవసాయ శాఖ చేపట్టిన ఈ వ్యూహాత్మక ప్రణాళిక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెంపొందించేలా చేస్తోంది..

సాధారణంగా యాసంగి సీజన్లు రైతులు అధికంగా వరి సాగు వైపే మొగ్గుచూపుతూ ఉంటారు.. అయితే, భారీగా నీటి వినియోగం అవసరమయ్యే వరి పంట వల్ల చివరి ఆయకట్టుకు మీరందక రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. భూగర్భ జలాల సంరక్షణతో పాటు తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే ఆరుతడి.. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకమైన కార్యాచరణను వేగవంతం చేస్తూ వస్తోంది..

వీటిపై ప్రత్యేకమైన దృష్టి..
మార్కెట్లో మంచి డిమాండ్ తో పాటు మద్దతు ధరల్లో లభించే పంటల సాగును పెంచాలని ప్రభుత్వాన్ని నిర్ణయించింది.. వేరుశనగ తో పాటు పొద్దు తిరుగుడు, కుసుమ, నువ్వుల సాగును ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా శనగతో పాటు మినుములు, పెసరు పంటను పెద్ద ఎత్తున సాగు చేసేందుకు క్షేత్ర సాయి ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఒక ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో రెండు నుంచి మూడు ఎకరాల ఆరుతడి పంటను సులభంగా పండించవచ్చని వ్యవసాయ నిపుణులు రైతులకు వివరిస్తూ వస్తున్నారు..

రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించేందుకు నాణ్యమైన విత్తనాలను రాయితీపై అందించేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయట. గ్రామాల వారిగా రైతు వేదికల కేంద్రంగా అవగాహన సదస్సును నిర్వహించి.. ఆధునిక సాగు పద్ధతులతో పాటు సూక్ష్మ సేద్యం ప్రాధాన్యతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.. వాతావరణ ప్రతికూలతను శాస్త్రీయ దృక్పథంతో అధిగమించి.. రైతులు నష్టపోకుండా లాభసాటి పంటల వైపు నడిపించడమే లక్ష్యంగా యంత్రాంగం క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తుంది..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES