Telugu heroins De Glamour Roles: సమంత, రష్మిక మందన్నలు స్టార్ హీరోయిన్స్‌గ చెలరేగిపోతున్నారు. ‘రంగస్థలం’ వచ్చి 8 ఏళ్లు దాటినా.. రామలక్ష్మిగా సమంత చేసిన మాయ ఎవరు మరిచిపోలేదు. ఇక ‘పుష్ప’ వచ్చి మూడేళ్లైపోయినా శ్రీవల్లిగా రష్మిక పోషించిన డీ గ్లామర్ పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు. ఈ సినిమాలు వాళ్ల కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పాయి. కేవలం గ్లామర్ రోల్స్ చేయడం కంటే మట్టి వాసన ఉండే సహజమైన పాత్రలు చేస్తేనే హీరోయిన్ల కెరీర్ దూసుకుపోతుందనడానికి ఈ సినిమాలు పెద్ద ఎగ్జాంపుల్. ఇక రాబోయే ‘మైసా’ సినిమాలో రష్మిక మందన్న అడవి అమ్మాయి పాత్రలో డీ గ్లామర్ పాత్రలో కనిపించబోతుంది. అటు ‘రణబాలి’ సినిమాలో ఆ ఫార్ములానే టాలీవుడ్ హీరోయిన్లందరినీ డీ గ్లామర్ వైపు అడుగులు వేసేలా చేస్తోంది.
భోగిలో డీ గ్లామర్ పాత్రలో అనుపమ..
శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘భోగి’ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ సులోచన అనే పల్లెటూరి యువతిగా మేకప్ లేకుండా నాచురల్‌గా కనిపించబోతుంది. ఇదే సినిమాలో డింపుల్ హయాతీ సైతం డీ గ్లామర్ పాత్రలోనే నటిస్తోంది.
రౌడీ జనార్దన..
కీర్తి సురేష్ సైతం ‘రౌడీ జనార్ధన’లో రొటీన్ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ చాలా ఇంటెన్స్ అండ్ డీ గ్లామర్ లుక్‌తో కనిపించుంది. అలాగే ఐశ్వర్య లక్ష్మి ‘సంబరాల ఏటిగట్టు’లో పక్కా డీ గ్లామర్ రోల్‌లో కనిపించబోతుంది. మొత్తానికి టెంపరరీ గ్లామర్ కంటే పర్మినెంట్‌గా ఉండే మట్టికథలే హీరోయిన్ల కెరీర్‌కు మైలేజ్ ఇస్తాయని ఈ సినిమాలే స్పష్టం చేస్తున్నాయి.