టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి పరీక్ష ఫీజు తేదీలు సవరణ! పూర్తి వివరాలు ఇవే..!!
TG SSC Exams 2027: తెలంగాణలోని పదవ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. 2027 మార్చిలో నిర్వహించనున్న టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపు గడువును అధికారులు సవరించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సోమవారం కొత్త తేదీలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు.
TG SSC Exams 2027: తెలంగాణలోని పదవ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. 2027 మార్చిలో నిర్వహించనున్న టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపు గడువును అధికారులు సవరించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సోమవారం కొత్త తేదీలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. 2027 మార్చి పదవ తరగతి రెగ్యులర్ విద్యార్థులతోపాటు గతంలో పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సైబర్ ట్రెజరీ ద్వారా ఆన్ లైన్ లో పరీక్షఫీజును చెల్లించవచ్చని స్పష్టం చేసింది.
అన్ని సబ్జెక్టులకు రూ. 125, మూడు సబ్జెక్టుల వరకు హాజరయ్యే విద్యార్థులకు రూ. 110 ఫీజు నిర్ణయించారు. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు పరీక్ష రాసే విద్యార్థులు రూ. 125 చెల్లించాలి. వ్రుత్తి విద్య కోర్సుల విద్యార్థులు రెగ్యులర్ పరీక్ష ఫీజు రూ. 125తోపాటు అదనంగా రూ. 60 చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పరీక్ష ఫీజు చెల్లింపు గడువులను ఎట్టి పరిస్ధితుల్లోనూ మళ్లీ పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
అధికారిక వెబ్ సైట్ www.bse.telangana.gov.in ద్వారా స్కూల్ లాగిన్ లో మాత్రమే సైబర్ ట్రెజరీ అనుసంధానంతో ఆన్ లైన్ చెల్లింపులు చేయవచ్చని సూచించింది. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ చలాన్స్ లేదా మాన్యువల్ బ్యాంక్ చలాన్స్ ను ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతించబోమని అధికారులు తేల్చి చెప్పారు.
సవరించిన ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది:
ఆలస్యపు రుసుములు లేకుండా: విద్యార్థులు ప్రధానోపాధ్యాయునికి ఫీజులు చెల్లించడానికి చివరి తేదీ: నవంబర్ 26, 2026
సైబర్ ట్రెజరీ ద్వారా ప్రధానోపాధ్యాయులు ఫీజులు చెల్లించడానికి చివరి తేదీ: నవంబర్ 27
విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో DEOకి సమర్పించడానికి చివరి తేదీ: నవంబర్ 30
పాఠశాల eNRను DGEకి సమర్పించడానికి చివరి తేదీ: డిసెంబర్ 14
రూ. 50 ఆలస్యపు రుసుముతో:
విద్యార్థులు ఫీజులు చెల్లించడానికి చివరి తేదీ: నవంబర్ 28 నుండి డిసెంబర్ 8 వరకు
ప్రధానోపాధ్యాయులు ఫీజులు చెల్లించడానికి చివరి తేదీ: డిసెంబర్ 9
విద్యార్థుల వివరాలను సమర్పించడానికి చివరి తేదీ: డిసెంబర్ 11
రూ. 200 రూపాయల ఆలస్య రుసుము:
విద్యార్థులు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: డిసెంబర్ 10 నుండి 21 వరకు
ప్రధానోపాధ్యాయులు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: డిసెంబర్ 22
DEOకి వివరాలు సమర్పించడానికి చివరి తేదీ: డిసెంబర్ 28
పాఠశాల eNR సమర్పించడానికి చివరి తేదీ: జనవరి 7, 2027
500 రూపాయల ఆలస్య రుసుముతో:
విద్యార్థులు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: డిసెంబర్ 23 నుండి జనవరి 4, 2027 వరకు
ప్రధానోపాధ్యాయులు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జనవరి 5, 2027
DEOకి వివరాలు సమర్పించడానికి చివరి తేదీ: జనవరి 6, 2027.
Also Read: