• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /OPS కోసం రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సామూహిక సెలవు..!!

OPS కోసం రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సామూహిక సెలవు..!!

TSCPSEU: పాత పెన్షన్ పథకాన్ని (OPS) తిరిగి అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (CPS) ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ నిరసనను ప్రభుత్వానికి బలంగా తెలియజేసేందుకు ఈ నెల 17వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా సామూహిక సెలవు పాటించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ వెల్లడించారు.

Written ByBhoomi
Published: Nov 16, 2026, 09:46 IST|Updated: Nov 16, 2026, 09:48 IST
joinshare
OPS కోసం రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సామూహిక సెలవు..!!
Image Credit: Telangana Government Employees

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

 TSCPSEU: పాత పెన్షన్ పథకాన్ని (OPS) తిరిగి అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (CPS) ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ నిరసనను ప్రభుత్వానికి బలంగా తెలియజేసేందుకు ఈ నెల 17వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా సామూహిక సెలవు పాటించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ వెల్లడించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఈ భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.

మొత్తం 2.60లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల్లో అత్యవసర సేవలకు 45వేల మందిని మినహాయించి.. మిగతా 2.15లక్షల మంది సామూహిక సెలవుల్లో పాల్గొనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి 3ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు సామూహిక సెలవులు పాటిస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో భారీగా ధర్మ దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే 1.5లక్షల మందికి పైగా ఉద్యోగులు సామూహిక సెలవు కోసం దరఖాస్తులు ఇవ్వడం కూడా తమ ఉద్యమానికి లభిస్తున్న విశేష స్పందనకు నిదర్శనమన్నారు. 
 
అంతకుముందు ఆగస్టు 23న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిర్వహించిన 'జన జాగరణ సభ' తీర్మానాలను యూనియన్ నేతలు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజుకు అందజేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వరి శ్రీకాంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళలోనూ పాత పెన్షన్ పథకాన్ని తిరిగి అమలు చేయాలన్నదే ఉద్యోగుల ప్రధాన ఆకాంక్షగా ఉందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా సీపీఎస్ రద్దు దిశగా తక్షణమే అడుగులు వేయాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రతి సీపీఎస్ ఉద్యోగి తమ నెలవారీ వేతనంలో 11.5 శాతం ఆర్థిక భారాన్ని మోస్తున్నప్పటికీ, పదవీ విరమణ అనంతరం గౌరవప్రదమైన పెన్షన్ కానీ, సరైన వైద్య భద్రత కానీ లభించకపోవడం తీవ్ర అన్యాయమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన ఈ సామూహిక సెలవు ఉద్యమానికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ నిరసనలో భాగంగా నల్లగొండలో నిర్వహించనున్న 'ధర్మదీక్ష' కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి స్వయంగా పాల్గొననున్నారు.

Also Read: 

తరచూ అలసట, తల తిరగడం వేధిస్తున్నాయా? విటమిన్ B12 లోపం కావొచ్చు..!!

 

సామాన్యుడికి బియ్యం మంట.. ప్రభుత్వం రేట్లు ఫిక్స్ చేసినా కిలో సన్నబియ్యం రూ.100..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Employees
Telugu News
Telangana News