నేడు తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన..
Telangana Rains: ఆంధ్ర ప్రదేశ్‌లో అక్వాన్ తుపాను గండం దాటింది. ఒడిషా వైపు వెళ్లిపోవడంతో ఓ మోస్తరు నష్టంతో ఏపీ బయటపడింది. కానీ తపాను ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఈ తుపాను ఎఫెక్ట్ తెలంగాణపై పడింది. ఈ నేపథ్యంలో నేడు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.
Telangana Weather Update: అవును.. నేడు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని భారత వాతావరణ శాఖ సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్వాన్ తుపాను ప్రభావంతో ఉత్తర, తూర్పు జిల్లాల వైపు వర్షాలు పడే అవకాశాలున్నట్టు తెలుస్తుంది.
30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు..
ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, కొమరంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నాయి. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
ఈదురు గాలులు పడే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షం పడే సమయంలో ఉరుములు, మెరుపులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పొలాల్లో ఉండకూడదని సూచించారు. అంతేకాదు ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర, హోర్డింగు దగ్గర ఉండరాదని తెలిపింది. మొత్తంగా ప్రజలు వర్షం సమయంలో బయట ఉండకుండా ఏదైనా షెల్టర్‌లో ఉండాలని సూచిస్తున్నారు.