• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Indiramma Saree: మహిళలకు శుభవార్త.. రేపు ఇందిరమ్మ చీరల పంపిణీ!

Indiramma Saree: మహిళలకు శుభవార్త.. రేపు ఇందిరమ్మ చీరల పంపిణీ!

Tomorrow Indiramma Saree Distribution Starts In Telangana: తెలంగాణ మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త. రేపటి నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనుంది. సిద్దిపేట వేదికగా ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కీలక వివరాలు వెల్లడించారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 18, 2026, 18:35 IST|Updated: Nov 18, 2026, 18:43 IST
joinshare
Indiramma Saree: మహిళలకు శుభవార్త.. రేపు ఇందిరమ్మ చీరల పంపిణీ!
Image Credit: Indiramma Saree Scheme

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Saree Scheme: మహిళలకు తెలంగాణ ప్రభుత్వం చీరలు మరోసారి పంపిణీ చేయనుంది. బతుకమ్మ చీరల స్థానంలో ఇందిరమ్మ చీరల పేరిట తెలంగాణ సర్కార్‌ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందిరమ్మ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రేప‌టి నుంచి ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారని వెల్లడించారు.

'తెలంగాణ ఆడబిడ్డలకు పుట్టింటి సారెగా ఇందిరమ్మ చీరలు అందిస్తున్నాం. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆత్మీయ కానుక ఇది' అని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. ఈసారి చిలుక ప‌చ్చ రంగుల్లో ఆక‌ర్శ‌ణీయంగా ఇందిర‌మ్మ చీర‌లు ఉన్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి ఇప్పటికే జిల్లాలకు చీరలు చేరాయని వివరించారు. ప్రతి ఆడబిడ్డ ముఖంలో చిరునవ్వు చూడాలనే సంకల్పంతో ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇందిరమ్మ ఆశయాలకు అనుగుణంగా మహిళల గౌరవం, ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తున్న ప్రజా ప్రభుత్వం ఉంటుందని.. మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి లక్ష్యంగా మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం బాటలు వేస్తోందని మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు.

ఈ చీరల పంపిణీపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ రేపు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. బ్యాంకుల జాతీయీకరణ, భూ సంస్కరణలు, పేదలకు సంక్షేమ పథకాలు అందించడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో ఇందిరాగాంధీ దేశ చరిత్రలో చెరగని ముద్ర వేశారని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని వివరించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా అండగా నిలవాలన్నదే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఇందిరమ్మ చీరలు తెలంగాణ ఆడపడుచులకు ఆత్మ గౌరవం, ఆత్మీయతకు ప్రతీక ఇందిరమ్మ చీరలు అని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వివరించారు. చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం మహిళలపై తమ ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి నిదర్శనమని తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పేదలకు సామాజిక భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తూ వారి జీవనానికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Govt Schemes
Telangana News
Telugu News