SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad: మేడ్చల్ లో కానిస్టేబుల్ ఓవరాక్షన్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వ్యక్తిపై దాడి.. వీడియో వైరల్..

Hyderabad Police: డ్రంక్ అండ్ డ్రైవ్ తనఖీల్లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఒక వ్యక్తిని పట్టుకుని చెంపపై కొట్టాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు.

Written By Inamdar Paresh
Published: Oct 24, 2026, 02:42 PM IST | Updated: Oct 24, 2026, 02:47 PM IST
Image Credit: medchal constable slaps man video
Join

Traffic Constable slapped on man in medchal Hyderabad: పోలీసులు తరచుగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని ప్రజలకు సూచిస్తారు. రాంగ్ రూట్ లో వెళ్లకూడదని, ట్రిబుల్ రైడింగ్ చేయోద్దని చెబుతుంటారు. తప్పతాగి వాహనాల్ని నడిపించ కూడదని చెప్తారు. అయిన కూడా కొంత మంది మాత్రం తమ వరస మార్చుకొరు. ఈ క్రమంలో ప్రతిరోజు వాహన దారులు ట్రాఫిక్ నియమాల్ని ఉల్లంఘిస్తున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. 

 

 

ఈ క్రమంలో  పోలీసులు వీకెండ్ లు వచ్చిందంటే పలుచోట్ల వాహనాల్ని ఆపిచెక్ చేస్తారు.  తాగి వాహనాల్లో నడిపిస్తున్నట్లు దొరికితే మాత్రం తగిన జరిమానాలు విధించడంతో పాటు అరెస్ట్ లు కూడా చేయడానికి వెనుకాడటంలేదు. ఈ  క్రమంలో హైదరాబాద్ లో లోని మేడ్చల్లో జరిగిన ఘటన వార్తలలో నిలిచింది.


హైదరాబాద్‌లోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. మేడ్చల్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ గిరి అనే వ్యక్తిని పట్టుకున్నాడు. ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాడు. ఇంతలో పోలీస్ తో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో  కోపంతో హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ బైకర్ గిరిని చెంప ఛెళ్లు మనేలా కొట్టాడు.   ఈ ఘటనతో బైకర్ ఆశ్చర్యపోయాడు. అసలు ఎందుకు కొడుతున్నారంటూ  అడిగిన కూడా వెనక్కు తగ్గలేదు. 

ఆ తర్వాత బైకర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనను అక్కడున్న వారు కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.   దీనిపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పోలీసు అయినంత మాత్రాన ఆ కొట్టడం ఏంటని ఫైర్ అవుతున్నారు. తప్పతాగితే కేసు పెట్టి కోర్టులో ప్రవేశ పెట్టాలి లేదా జరిమాన విధించాలి కానీ ఈ కొట్టడం ఏంటని మండిపడుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES