• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. CPS ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్న DA ఏరియర్స్..!!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. CPS ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్న DA ఏరియర్స్..!!

TS Employees Dasara DA Gift: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలోని ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ ముందు తీపికబురు అందించింది.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Sep 30, 2026, 09:23 AM IST|Updated: Sep 30, 2026, 09:25 AM IST
joinshare
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. CPS ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్న DA ఏరియర్స్..!!
Image Credit: TS Employees Dasara DA Gift:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

TS Employees Dasara DA Gift: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలోని ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ ముందు తీపికబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు ఎట్టకేలకు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. G.O.MS. NO-3 కింద మంజూరైన 3 డీఏలకు సంబంధించిన ఏరియర్స్ (సెప్టెంబర్ 2022 సబ్మిషన్) ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్లలో క్రెడిట్ అవుతుండటంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దసరా పండుగ వేళ ఈ నగదు జమ అవుతుండటం వారికి ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చిందని చెప్పాలి.

నిబంధనల ప్రకారం, సీపీఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ ఏరియర్స్ బకాయిల్లో 10 శాతం మొత్తాన్ని వారి ప్రాన్ (PRAN - Permanent Retirement Account Number) ఖాతాలకు మళ్లిస్తారు. మిగిలిన 90 శాతం మొత్తాన్ని నేరుగా వారి జీతాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ప్రస్తుతం 2022 సంవత్సరానికి (09/2022 సబ్మిషన్) సంబంధించిన డీఏ బకాయిలు ఇదే విధానంలో ఉద్యోగుల ఖాతాల్లో క్రెడిట్ అవుతున్నాయి. ట్రెజరీల ద్వారా బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం కావడంతో చాలా మంది ఉద్యోగులకు ఇప్పటికే మెసేజ్‌లు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మొత్తం ఆరు (6) డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ప్రభుత్వంతో సుదీర్ఘ కాలంగా చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో, ఇటీవల సెప్టెంబర్ నెలలో సచివాలయంలో మంత్రుల ఉపసంఘం.. ఉద్యోగ సంఘాల నేతలకు మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు సఫలమయ్యాయి.

ఆ చర్చల్లో తీసుకున్న నిర్ణయం మేరకు.. పెండింగ్‌లో ఉన్న మొత్తం ఆరు డీఏలలో మూడింటిని (3 DAs) మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. వీటిలో రెండు డీఏలను దసరా పండుగ లోపు.. మరో డీఏను వచ్చే సంక్రాంతి నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చింది. ప్రభుత్వ హామీకి అనుగుణంగానే తాజాగా అధికారుల నుంచి నిధులు విడుదల కావడం, 2022 నాటి డీఏలు అకౌంట్లలో పడటం మొదలైంది.

కేవలం డీఏలు మాత్రమే కాకుండా, ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ బిల్లులు, సరెండర్ లీవులు, పీఆర్సీ బకాయిలు తదితర సుమారు రూ. 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను వచ్చే ఏడాది (2027) మార్చి నాటికి పూర్తిగా క్లియర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

సీపీఎస్ రద్దుపై త్వరలో కమిటీ:
ఇదే సమయంలో సీపీఎస్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన  పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. సీపీఎస్ రద్దు సాధ్యాసాధ్యాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు త్వరలోనే అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఏదేమైనప్పటికీ, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 2022 డీఏ బకాయిలు దసరాకు ముందు చేతికి అందుతుండటం సీపీఎస్ ఉద్యోగుల ఇళ్లలో పండుగ శోభను రెట్టింపు చేసింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News
Employees
DA Hike