SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఆఫీసులు ఖాళీ.. బడులకు తాళాలు.. సామూహిక సెలవులో లక్షన్నర మంది ఉద్యోగులు..!!

TS Employees Mass Leave: తెలంగాణలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు రోడ్డెక్కాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలన్న డిమాండ్ తో నేడు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక సెలవు పాటిస్తున్నారు.

Written By Bhoomi
Published: Nov 17, 2026, 11:45 IST | Updated: Nov 17, 2026, 13:20 IST
Image Credit: TS Employees Mass Leave:
Join

TS Employees Mass Leave: తెలంగాణలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు రోడ్డెక్కాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలన్న డిమాండ్ తో నేడు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక సెలవు పాటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ఆందోళన చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ వెల్లడించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్మదీక్షలు చేపట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. వారిలో 45 మంది అత్యవసర సేవల విభాగాల్లో పనిచేస్తున్నట్లు యూనియన్ తెలిపింది. మిగిలిన ఉద్యోగుల్లో ఇప్పటికే 1.5లక్షల మందికిపైగా సామూహిక సెలవులు పెట్టారు. మొత్తం 2.15 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఉద్యోగుల ఉద్యమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కూడా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఉపాధ్యాయులతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వ్యవసాయ, అటవీ, పశుసంవర్ధక, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, న్యాయశాఖల ఉద్యోగులు పెద్ద ఎత్తున సామూహిక సెలవులు పెట్టారు. రాష్ట్రంలో మొత్తం 3.6 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. నేడు దాదాపు 50 శాతం మంది సెలవుల్లో ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. దీంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించిపోగా.. పలు పాఠశాలల్లో బోధనకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

ఇందిరాపార్కు వద్ద కొనసాగుతున్న ధర్మదీక్ష:
ప్రభుత్వ తీరును నిరసిస్తూ సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు నరేందర్‌రావు, మ్యాన పవన్‌కుమార్ నేతృత్వంలో నేడు ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల ఉద్యోగులంతా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న మహా ధర్మదీక్షకు భారీగా తరలివస్తున్నారు. అలాగే ఇతర జిల్లా కేంద్రాల్లోనూ ఉద్యోగులు ధర్మదీక్షల్లో పాల్గొంటున్నారు.

ఉపాధ్యాయ, గురుకుల సంఘాల సంపూర్ణ మద్దతు:
ఈ ధర్మదీక్షకు పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎస్జీటీయూ (SGTU) రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశం పిలుపు మేరకు ఉపాధ్యాయులు సెలవు పెట్టి నిరసనలో భాగస్వాములయ్యారు. వీరితో పాటు తెలంగాణ గురుకుల ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రౌతు అజయ్ కుమార్, పైళ్ల ప్రకాశ్‌రెడ్డి కూడా సామూహిక సెలవుల ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.

Also Read: 

 

 

చదువే తలరాతను మార్చే ఆయుధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!

 

 

 

మళ్లీ పతనమైన బంగారం ధర.. తులం 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES