SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

10th క్లాస్ విద్యార్థులకు బిగ్ అప్‌డేట్.. టెన్త్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల..!!

TS SSC Exams 2026: తెలంగాణలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బిగ్ అలర్ట్. టెన్త్.. ఒకేషనల్ పబ్లిక్ ఎగ్జామ్స్ కు సంబంధించి ప్రభుత్వ పరీక్షల విభాగం పరీక్షల ఫీజు షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేసింది.

Written By Bhoomi
Published: Oct 22, 2026, 06:01 PM IST | Updated: Oct 22, 2026, 06:03 PM IST
Image Credit: TS SSC Exams 2026:
Join

TS SSC Exams 2026: తెలంగాణలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బిగ్ అలర్ట్. టెన్త్.. ఒకేషనల్ పబ్లిక్ ఎగ్జామ్స్ కు సంబంధించి ప్రభుత్వ పరీక్షల విభాగం పరీక్షల ఫీజు షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేసింది. పబ్లిక్ ఎగ్జామ్స్ కు హాజరయ్యే రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజును చెల్లించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థులు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు ఫరీక్ష ఫీజును చెల్లించే అవకాశం ఉంటుంది. నవంబర్ 16వ తేదీ తర్వాత ఫీజు చెల్లించే వారిపై లేట్ ఫీజు వర్తిస్తుంది. విడతల వారీగా లేట్ ఫీజుతో డిసెంబర్ 28వ తేదీ వరకు ఫీజు చెల్లించే ఛాన్స్ కల్పించారు.

ఆలస్య రుసుములు లేకుండా చెల్లింపు: అక్టోబర్ 30 నుండి నవంబర్ 16 వరకు అవకాశం ఉంటుంది. 
ఆలస్య రుసుములతో చివరి గడువు: డిసెంబర్ 28వ తేదీ వరకు అవకాశం కల్పించారు.

ఫీజు చెల్లింపులు కేవలం సైబర్ ట్రెజరీ సిస్టమ్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.  పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నుండి ఆన్‌లైన్‌లో వసూలు చేసిన పరీక్ష ఫీజులను కేవలం సైబర్ ట్రెజరీ సిస్టమ్ ద్వారా మాత్రమే జమ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. మాన్యువల్ ఇన్‌వాయిస్‌లు లేదా ఇతర పద్ధతుల ద్వారా చెల్లించిన ఫీజులను తాము అంగీకరించబోమని వారు తెలిపారు. అంతేకాకుండా, నిర్దేశించిన గడువు తర్వాత ఫీజు చెల్లింపులకు ఎలాంటి పొడిగింపులు ఇవ్వబడవని స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మినహాయింపు:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ,  బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు నుండి పూర్తి మినహాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. అర్హులైన విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి, అవసరమైన సర్టిఫికెట్లను సమర్పించి, తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES