• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /Bank Charges: బ్యాంకు ఖాతాదారులకు భారీ షాక్‌.. ఛార్జీలు పెంచుతూ షాకింగ్‌ నిర్ణయం

Bank Charges: బ్యాంకు ఖాతాదారులకు భారీ షాక్‌.. ఛార్జీలు పెంచుతూ షాకింగ్‌ నిర్ణయం

ICICI Bank Big Shock To Savings Account Holders: బ్యాంకు ఖాతాదారులకు మరో బ్యాంక్‌ భారీ షాక్‌ ఇచ్చింది. ఉచితంగా ఉన్న సేవలకు ఛార్జీలు పెంచుతూ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఇకపై లావాదేవీలు చేయాలంటే అదనంగా చెల్లింపులు చేయాల్సిందే. ఇంతకీ ఏ బ్యాంకు? ఏ చార్జీలు పెంచిందో తెలుసుకుందాం.

Written By Ravi Kumar Sargam
Published: Oct 22, 2026, 07:49 PM IST|Updated: Oct 22, 2026, 07:51 PM IST
joinshare
Bank Charges: బ్యాంకు ఖాతాదారులకు భారీ షాక్‌.. ఛార్జీలు పెంచుతూ షాకింగ్‌ నిర్ణయం
Image Credit: ICICI Bank

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AP Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ తుఫాన్ ముప్పు..బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ జిల్లాలకు భారీ వర్షసూచన!

AP Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ తుఫాన్ ముప్పు..బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ జిల్లాలకు భారీ వర్షసూచన!

2

AP Inter Exams Schedule: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది! ఫిబ్రవరిలోనే మొదటి ఎగ్జామ్..తేదీల వివరాలు ఇవే!

3

Bank Charges: బ్యాంకు ఖాతాదారులకు భారీ షాక్‌.. ఛార్జీలు పెంచుతూ షాకింగ్‌ నిర్ణయం

4

India vs New Zealand Highlights: 'ఆ ఇద్దరికి చెప్పాల్సిన పనిలేదు, బాదడమే తెలుసు.. మ్యాచ్ చేతుల్లో పెట్టేస్తారు..'

5

వాట్సాప్ వీడియో కాల్‌లో శవాన్ని చూసి డెత్ సర్టిఫికెట్.. బుల్లెట్ మరణాన్ని గుండెపోటుగా మార్చి..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Savings Account Holders: సేవింగ్‌ ఖాతా కలిగిన వినియోగదారులకు ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ భారీ షాక్‌ ఇచ్చింది. తన సేవింగ్స్ అకౌంట్ వినియోగదారులపై ఛార్జీల భారం మోపింది. తమ వినియోగదారులకు సంబంధించి ఛార్జీలను పెంచేసింది. బ్యాంకింగ్ సేవల రుసుములను తాజాగా సవరించింది. ఎంపిక చేసిన నగదు లావాదేవీల ఛార్జీలను పెంచుతూ ఐసీఐసీఐ నిర్ణయం తీసుకుంది. పెంచిన కొత్త ఛార్జీలు ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ఛార్జీలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటన ప్రకారం.. కొత్తగా సవరించిన ఛార్జీలు సేవింగ్స్ ఖాతాదారులకు ప్రస్తుతం ఉన్న ఉచిత లావాదేవీల పరిమితిలో ఎటువంటి మార్పు లేదు. అకౌంట్‌ వినియోగదారులు యథావిధిగా నెలకు మూడు ఉచిత నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ పొందవచ్చు. ఈ ఉచిత పరిమితి దాటిన తర్వాత లేదా నెలవారీ ఉచిత క్యాష్ లిమిట్ విలువను దాటితే వినియోగదారులు అధిక మొత్తంలో చెల్లించుకోవాల్సిన పరిస్థితి.

ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌లు, క్యాష్ రీసైక్లర్ మెషిన్ల ద్వారా చేసే నగదు లావాదేవీలపై కొత్తగా పెంచిన ఛార్జీలు వర్తిస్తాయి. ఉచిత పరిమితులు దాటిన తర్వాత ప్రతి రూ.వెయ్యి లావాదేవీపై ఛార్జీలు పెరగనున్నాయి. గతంలో ఉన్న రూ.3.50 ఛార్జీ ఇప్పుడు రూ.4కు పెరగనుంది. నెలవారీ ఉచిత నగదు పరిమితి రూ.లక్ష దాటితే తర్వాతి లావాదేవీలు రూ.లక్ష పైబడిన లావాదేవీలకు ఛార్జీల పెంపు వర్తిస్తుంది.

బ్యాంకు ఖాతాదారుల్లో ఎవరిపై భారం పడనుంది అంటే.. నెలవారీ పరిమితికి లోబడి సాధారణ లావాదేవీలు నిర్వహించేవారికి ఎలాంటి భారం ఉండదు. చిన్న మదుపర్లు, ఖాతాదారులకు ఛార్జీల పెంపు నుంచి మినహాయింపు ఉంది. బ్యాంక్ శాఖల ద్వారా పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు చేసే వారు, విత్‌డ్రా చేసే హై-వాల్యూ కస్టమర్లు అధిక ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరంతా డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎక్కువ ఛార్జీలు భరించాల్సి ఉందని ఐసీఐసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేలా బ్యాంకులు కొత్త నిబంధనలు తీసుకువస్తున్న సమయంలో.. ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ సాధారణ ఖాతాదారులపై ఆర్థిక భారం మోపుతుండడం గమనార్హం.

Add Zee News as a Preferred Source
TAGS:
Business News
Telugu News
Reserve Bank of India
Trending News