• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Hyderabad: గుడిలో మహిళతో ప్రేమ వివాహం.. అమీర్ పేట్ ఓయోకు తీసుకొచ్చి రొమాన్స్.. ఇక్కడే షాకింగ్ ట్విస్ట్.!.

Hyderabad: గుడిలో మహిళతో ప్రేమ వివాహం.. అమీర్ పేట్ ఓయోకు తీసుకొచ్చి రొమాన్స్.. ఇక్కడే షాకింగ్ ట్విస్ట్.!.

Woman murder in Ameerpet oyo lodge: వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసమందర్ గ్రామంలో 2013లో శిరీష అనే మహిళ వివాహం చేసుకుని మనస్పర్థల కారణంగా 2016లో భర్తకు విడాకులు ఇచ్చి తల్లిదండ్రులతో ఉంటుంది. ఆమెకు ఇటీవల శ్రీనివాస్ అనేవ్యక్తితో పరిచయం అయ్యింది. అది ప్రేమగ మారింది.

Written ByInamdar Paresh
Published: Sep 30, 2026, 12:28 PM IST|Updated: Sep 30, 2026, 12:38 PM IST
joinshare
Hyderabad: గుడిలో మహిళతో ప్రేమ వివాహం.. అమీర్ పేట్ ఓయోకు తీసుకొచ్చి రొమాన్స్.. ఇక్కడే షాకింగ్ ట్విస్ట్.!.
Image Credit: vikarabadsirishamurderinameerpetlodge

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vikarabad woman brutally murder by her husband in ameerpet oyo lodge: సమాజంలో ఇటీవల ప్రేమ వివాహాలు, పెళ్లిళ్ల అంశంలో అనేక షాకింగ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతే కాకుండా నిత్యం కట్టుకున్న వారిని కాటికి పంపుతున్న అనేక ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది ప్రేమించిన వారిని చీట్ చేసి చంపుతుంటే, మరికొంత మంది పెళ్లి చేసుకున్న వారిని కాటికి పంపుతున్నాడు. ఈ క్రమంలో అమీర్‌పేట్ గోకుల్ ప్రైడ్ ఓయోలో మహిళ అనుమానాస్పద మృతి ఘటన సంచలనంగా మారింది..

వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసమందర్ గ్రామంలో 2013లో వివాహం చేసుకుని మనస్పర్థల కారణంగా 2016లో శిరీష అనే మహిళ భర్తకు విడాకులు ఇచ్చి, తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఆమె ఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ లో  పనిచేస్తుంది.

ఈ క్రమంలో శిరీషకు ఎ. శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను పెద్దేముల్ మండలం ఓగ్లాపూర్ గ్రామానికి  చెందినవాడు. వీరి మధ్య పరిచయం  కాస్త ప్రేమగా మారింది. వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో శిరిషను గుడిలో పెళ్లి చేసుకున్నాడు.  పెద్దలు వీరి పెళ్లిని అంగీకరించకపోవడంతో, హైదరాబాద్‌కు తరచుగా వచ్చి లాడ్జిలో ఏకాంతంగా గడిపి తిరిగి వెళ్లేవారని సమాచారం.

ఇదే క్రమంలో ఈ నెల 24వ తేదీన దుర్గ, గణేష్ అనే మారుపేర్లతో ఎస్‌ఆర్ నగర్ పరిధిలోని గోకుల్ ప్రైడ్ ఓయోలో ఈ జంట దిగారు. మరుసటి రోజు ఉదయం తాను వెళ్లిపోతూ, ఆమె అల్పాహారం అనంతరం చెక్‌అవుట్ చేస్తుందని హోటల్ సిబ్బందికి శ్రీనివాస్ తెలిపాడు. అయితే..
ఎంతకూ ఆమె బయటికి రాకపోవడంతో వేరే తాళంచెవితో గది తెరిచి చూడగా, విగతజీవిగా ఉన్న శిరీషను గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

శిరిష ఒంటిపై గాయాలు, రక్తపుమరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి కర్టెన్ రాడ్‌తో శిరీష తలపై బలంగా కొట్టి హతమార్చినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 

ఈ క్రమంలో శ్రీనివాస్ పై కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. శ్రీనివాస్ గతంలోనూ శిరీషను కొట్టి చికిత్స చేయించాడని, పలువురు యువతులను వేధించినట్టు అతనిపై పలు కేసులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Crime News
Telugu News