SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వినాయక నిమజ్జనానికి జల మండలి విస్తృత ఏర్పాట్లు..

Vinayaka Immersion 2026: వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సరఫరాతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తుల దాహార్తిని తీర్చేందుకు నగరంతో పాటు జలమండలి మూడు రీజియన్ల పరిధిలో (ఓఆర్ ఆర్ వరకు) గా 137 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ తెలిపారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Sep 25, 2026, 08:20 AM IST | Updated: Sep 25, 2026, 08:24 AM IST
Image Credit: Vinayaka Nimmajjanam Shobha Yatra
Join

Ganesh Nimajjaanam: హైదరాబాల్‌లో  గణేష్ నిమజ్జనోత్సవాలకు అన్ని శాఖలు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.  పోలీస్, మున్సిపల్, వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెుంట్స్ వాళ్లు ఎవరికి వారు భక్తుల సౌకర్యార్ధం పనులు చేపడుతున్నారు. ఇక  నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన 90 బేబీ పాండ్స్ వద్ద కూడా తాగునీటి క్యాంపులు జలమండలి ఏర్పాటు చేసింది. గణేష్ శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గాలలైన బాలాపూర్, చాంద్రాయణ గుట్ట, ఆలియాబాద్, శాలిబండ,  చార్మినార్, మోజంజాహి మార్కెట్,  ట్యాంక్‌బండ్, డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక 12 వాటర్ క్యాంపులు అందుబాటులో ఉంచారు.  ఇందుకోసం మొత్తం 40 లక్షల వాటర్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచారు అధికారులు.

ఇప్పటికే 3, 5, 7, 9వ రోజుల నిమజ్జనాల సందర్భంగా ఓఆర్ఆర్ పరిధిలోని నిమజ్జన కొలనుల వద్ద జలమండలి తాగునీటి శిబిరాలను ఏర్పాటు చేసింది.  అవసరమైన ప్రాంతాల్లో డ్రమ్ముల ద్వారా కూడా మంచినీటిని అందిస్తోంది.

రీజియన్లలో ఆయా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పర్యవేక్షణ-
వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన తాగునీటి శిబిరాల నిర్వహణ, పర్యవేక్షణతో పాటు క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు నోడల్ అధికారులను నియమించినట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏరియాకు ప్రత్యేకంగా రూట్ అధికారులను నియమించామన్నారు.  

జలమండలి పరిధిలోని మూడు రీజియన్లలో ఆయా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీలు) తమ పరిధిలోని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నోడల్, రూట్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు.

శోభాయాత్ర జరిగే మార్గాల్లో వాటర్ లీకేజీలు, సీవరేజీ ఓవర్‌ఫ్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సీవర్ జెట్టింగ్ యంత్రాలను సిద్ధంగా ఉంచాలనోనారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పోలీసు, జీహెచ్ఎంసీ, హైడ్రా, ఉత్సవ కమిటీలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్నదాన శిబిరాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేయనున్నట్టు తెలిపారు.  జలమండలి క్వాలిటీ అస్యూరెన్స్ టీమ్‌లు (QAT) వాటర్ క్యాంపుల్లో తాగునీటి నాణ్యతను నిరంతరం పరిశీలించడంతో పాటు క్లోరిన్ స్థాయిలు నిర్ణీత మోతాదులో ఉండేలా పర్యవేక్షిస్తాయి.

భక్తుల రద్దీ ఎంత ఉన్నా తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా, శోభాయాత్ర మార్గాల్లో వాటర్ లీకేజీలు, సీవరేజీ ఓవర్‌ఫ్లోలకు తావులేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES