SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad: హైదరాబాద్‌లోని రాయదుర్గంలో దారుణం.. మత్తుమందు ఇచ్చి మహిళపై లైంగిక దాడి.. వీడియోలు తీసి మరీ.!.

Woman raped in raidurgam: ఒక పార్టీలో బాధితురాలికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, రహస్యంగా వీడియోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరిస్తు రెస్టారెంట్ వ్యాపారం పేరుతో ఆమె నుండి సుమారు రూ.43 లక్షలు కాజేశాడు.ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Written By Inamdar Paresh
Published: Sep 25, 2026, 06:45 PM IST | Updated: Sep 25, 2026, 06:53 PM IST
Image Credit: Hyderabadcrime(file)
Join

Woman allegedly raped and blackmailed in raidurgam Hyderabad: సమాజంలో కొంత మంది కామాంధులు పెట్రేగిపోయారు. పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. పసిపాప నుంచి పండుముసలి వరకు ఎవరిని వదలడంలేదు. ప్రతిరోజు మహిళలు వేధింపులు, అత్యాచారాలు, హత్యలకు గురౌతున్న ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. ప్రభుత్వాలు ఎన్నికఠిన చర్యలు తీసుకున్నా కూడా వీరిలో మార్పులు రావడంలేదు. 

 ఇటీవల హైదరాబాద్ లో మహిళలపై అత్యాచారాలు, హత్యలకు చెందిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఒక యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియోలు తీసి బెదిరించిన కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది. 

రాయదుర్గంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే మహిళకు, అక్కడ ఫుడ్ వెండర్ , బాక్స్ క్రికెట్ నిర్వాహకుడిగా పనిచేస్తున్న షేక్ నబీతో పరిచయం ఏర్పడింది. తరచుగా  ఇద్దరు మాట్లాడుకునే వారు. ఈ నేపథ్యంలో.. 2023లో జరిగిన ఒక పార్టీలో బాధితురాలితో కలిశాడు. ఆ సమయంలో కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమె స్పృహలో లేనప్పులు లైంగిక దాడి చేశాడు. ఈ ఛెండాలంను వీడియో కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని చూపిస్తు ఆమెను వేధింపులకు గురిచేశాడు. పలు విడతలుగా సోషల్ మీడియాలో వీడియోలు పెడతానని బెదిరిస్తు డబ్బులు వసూలు చేశాడు. 

ఆ తర్వాత రెస్టారెంట్ వ్యాపారం పేరుతో ఆమె నుండి సుమారు రూ.43 లక్షలు కాజేశాడు. యువతి వీడియోలను అడ్డం పెట్టుకుని నిందితుడు 2023 నుంచి 2026 ఆగస్టు వరకు బాధితురాలిని లైంగికంగా వేధిస్తూ, డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేశాడు. ఇక వేధింపులు భరించలేక బాధితురాలు తన భర్తకు చెప్పడంతో ఆయనతో కలిసి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు షేక్ నబీని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఈ ఘటన హైదరాబాద్ లో షాకింగ్ కు గురిచేసేదిలా మారింది. దీంతో మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES