Hyderabad: చనిపోయిన ప్రియుడు రోజు కలలోకి వస్తున్నాడు.!. శంషాబాద్‌లో యువతి ఏంచేసిందో తెలిస్తే షాక్.!.
Woman commits suicide in shamshabad: శంషాబాద్‌లోని సిద్ధార్థ కాలనీకి చెందిన నర్మద, నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌ను ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే సడెన్ గా ప్రియుడు సిద్దార్థ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి నర్మదా చాలా డీప్రెషన్ లోకి వెళ్లిపోయింది.
Woman commits suicide over boy friend death row in shamshabad: ఇటీవల చాలా మంది యువతీ, యువకులు ప్రేమ వివాహాలకు మొగ్గు చూపిస్తున్నారు. కొన్ని రోజుల పాటు కలిసి జర్నీ చేసి ఆ తర్వాత ఇద్దరి అభిప్రాయాలు కలిస్తే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. లేకుంటే బ్రేకప్ చెప్పుుకుంటున్నారు. కొంత మంది తమపెద్దలను ఎదిరించి కూడా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఇక పొరపాటున కూడా ప్రేమించిన వారికి ఏమన్న జరిగితే చాలా మంది ఎంతటి ఘోరానికైన వెనుకాడరు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన శంషాబాద్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సిద్ధార్థ కాలనీకి చెందిన నర్మద.. నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌ను ప్రేమించింది. ఇద్దరూ కూడా ఒకరిని మరోకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఇంతలో సిద్ధార్థ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ఘటనతో నర్మద తీవ్రంగా కుంగిపోయింది. అప్పటి నుంచి ఎవరితో మాట్లాడకుండా తన గదికే పరిమితం అయ్యింది.
సిద్ధార్థ్ తో తనకున్న ప్రేమను, ఆ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తు ఉండేది. అయితే.. నర్మదా సింగిల్్ గా ఉండేది. తరచుగా నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచేది. ఇటీవల తన సోదరితో.. సిద్ధార్థ్ కలలోకి వచ్చి తనను రమ్మని పిలుస్తున్నాడని పలు మార్లు చెప్పింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నర్మద ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కాసేటికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు డోర్ ఎంతకి తీయక పోవడంతో పగుల కొట్టి చూడగా.. నర్మదా ఉరికి వేలాడుతు కన్పించింది. దీంతో ఆ కుటుంబం గుండెలవిసేలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత.. చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం అందించారు. తండ్రి ఫిర్యాదుతో శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.