Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. గణపయ్య మండపం వద్ద యువకుడి దారుణ హత్య.. ఏంజరిగిందంటే..?..
Youth murder in lalaguda: నాలుగేళ్ల క్రితం ఒక ప్రేమ జంటకు సహాయం చేశాడని కార్తీక్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన వినాయక చవితి పండగ వేళ షాకింగ్ కు గురిచేసేదిలా మారింది.
Youth brutally murder in lalauda hyderabad: హైదరాబాద్ లో ఇటీవల హత్యలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. అంతే కాకుండా అపోసిషన్ పార్టీలు సైతం అసలు శాంతి భద్రతలు హైదరాబాద్ లో అదుపు తప్పాయని తరచుగా ఆరోపణలు చేస్తున్నాయి. పోలీసులు ఎంత అలర్ట్ గా ఉన్నామని చెప్పిన హత్యలు మాత్రం ఆగడంలేదు. తాజాగా.. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి పండగ వేళ దారుణం చోటు చేసుకుంది. ఒక యువకుడిని గణేషుడి మండపం వద్ద కొంత మంది అత్యంత దారుణంగా హతమార్చారు.
లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల క్రితం ఒక ప్రేమ జంటకు సహాయం చేశాడని కార్తీక్ అనే యువకుడిపై కొంత మంది దుండగులు దాడి చేశారు. ఇతని వల్ల ఆమె తన ప్రియుడితో కలిసి ఇంట్లొ వారికి తెలియకుండా పారిపోయిందని పగను పెంచుకున్నాడు .
అదును కోసం చూసి ఆతర్వాత వినాయకుడి మండపం వద్ద ఉన్నాడని తెలుసుకుని కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేశారు. ఈ ఘటనతో ఆప్రదేశంలోని వారు భయంతో పరుగులు పెట్టారు. యువకుడు వదలమని ప్రాధేయపడిన వదల్లదు.
అందరు చూస్తుంగానే హత్య ఘటన జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు రక్తపు మడుగులోఉన్న యువకుడి డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వినాయక చవితి పండగ వేళ ఈ ఘటన తీవ్రవిషాదకరంగా మారింది.