• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /మార్కుల పట్టిక కాదు.. పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరగాలి.. జీ తెలుగు గురువందనంలో ఎంపీ ఈటల భావోద్వేగం..!!

మార్కుల పట్టిక కాదు.. పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరగాలి.. జీ తెలుగు గురువందనంలో ఎంపీ ఈటల భావోద్వేగం..!!

Zee Telugu Guru Vandanam: తెలుగు నేలపై విద్యా వ్యవస్థ సంక్షోభం దిశగా పయనిస్తోందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. నిరుపేదలకు నాణ్యమైన చదువు అందించాల్సిన ప్రభుత్వ బడులు నిర్లక్ష్యానికి గురువుతున్నాయన్నారు.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 13, 2026, 03:53 PM IST|Updated: Oct 13, 2026, 03:55 PM IST
joinshare
మార్కుల పట్టిక కాదు.. పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరగాలి.. జీ తెలుగు  గురువందనంలో ఎంపీ ఈటల భావోద్వేగం..!!
Image Credit: Zee Telugu Guru Vandanam

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రేషనలైజేషన్ పేరిట సర్కారు బడులను చంపేస్తున్నారు.. జీ తెలుగు 'గురువందనం' లో మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్..!!

రేషనలైజేషన్ పేరిట సర్కారు బడులను చంపేస్తున్నారు.. జీ తెలుగు 'గురువందనం' లో మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్..!!

2

Bhatti Vikramarka Speech: "తెలంగాణలో విద్యారంగ విప్లవం" జీ తెలుగు న్యూస్ 'గురువందనం-2026'లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

3

మార్కుల పట్టిక కాదు.. పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరగాలి.. జీ తెలుగు గురువందనంలో ఎంపీ ఈటల భావోద్వేగం..!!

4

క్యూ2 ఫలితాలు అదరగొట్టినా షాక్..ఒక్కరోజే 8శాతం పడిపోయిన ఆర్బీఎల్ బ్యాంక్ షేర్లు.. అసలు కారణం ఇదే!

5

ICC Player Of The Month: ఐసీసీ 'ప్లేయర్స్ ఆఫ్ ది మంత్'గా శుభ్‌మన్ గిల్, షఫాలీ వర్మ! ప్రిన్స్ పేరిట సరికొత్త రికార్డు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Zee Telugu  Guru Vandanam: తెలుగు నేలపై విద్యా వ్యవస్థ సంక్షోభం దిశగా పయనిస్తోందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. నిరుపేదలకు నాణ్యమైన చదువు అందించాల్సిన ప్రభుత్వ బడులు నిర్లక్ష్యానికి గురువుతున్నాయన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు చదువును కేవలం లాభసాటి బిజినెస్ గా మార్చేశాయని భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ లో జరిగిన జీ తెలుగు న్యూస్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ అండ్ టీచర్స్ అవార్డ్స్ ( గురువందనం) వేదికగా ఈటెల రాజేందర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పాఠశాల విద్యారంగం..ఉపాధ్యాయుల స్థితిగతులు, క్షేత్రస్థాయి వాస్తవాలపై ఆలోచింపజేసే విధంగా ప్రసంగించారు.

 ప్రైవేట్ విద్యకు వ్యతిరేకం కాదు:

ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. నేను ప్రైవేట్ విద్యకు వ్యతిరేకం కాదు.. కానీ విద్యను అంగడి సరుకులా మార్చి బిజినెస్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. ఒక్కప్పటి గురుకులాల వైభవాన్ని.. ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను గుర్తు చేస్తూ..ఈటెల భావోద్వేగానికి లోనయ్యారు. నలంద, తక్షశిల వంటి మహోన్నత యూనివర్సిటీలు ఈ దేశంలో మేధావులకు పునాది వేశాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మేము చదువుకునే రోజుల్లో ఊరిలో ఉన్న దొర కొడుకు... గుడిసెలో ఉండే కొమురయ్య కొడుకైనా అంతా కలిసి జిల్లా పరిషత్ పాఠశాలలోనే చదువుకున్నాం. అప్పట్లో ప్రైవేట్ పాఠశాలలు.. భారీ ఫీజులు చెల్లించే కల్చర్ లేదు. బడిలోనే డ్రాయింగ్, పీఈటీ టీచర్లు, విశాలమైన ప్లే గ్రౌండ్స్ ఉండేవి. సాయంత్రం 4 అయ్యిందంటే.. బడులు కళకళలాడేవి. ఆ వాతావరణమే నేడు ప్రపంచవ్యాప్తంగా లండన్, అమెరికాలో స్థిరపడిన అనేకమంది భారతీయులకు బలమైన పునాది వేసిందని వ్యాఖ్యానించారు.  

 టీచర్ల రేషనలైజేషన్ విధానంపై ఈటెల ఫైర్:

ఇక ప్రభుత్వం చేపడుతున్న టీచర్ల రేషనలైజేషన్ విధానంపై ఈటెల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను కేటాయించే పద్ధది విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందని మండిపడ్డారు.  తరగతులను బట్టి, సబ్జెక్టుల ప్రాధాన్యతను బట్టి ఉపాధ్యాయులు ఉండాలి.  50 మంది పిల్లలు ఉన్నారని కేవలం ఇద్దరు టీచర్లనే కేటాయించి అన్ని తరగతులు చెప్పమంటే నాణ్యమైన విద్య ఎలా సాధ్యమవుతుందని ఈటెల ప్రశ్నించారు. 5ఏండ్లు, 10ఏండ్లు కష్టపడి కాంపిటీటివ్ పరీక్షలు రాసి నెగ్గిన అత్యంత నాణ్యమైన టీచర్లు ప్రభుత్వ బడుల్లోనే ఉన్నారు. కానీ వారికి సంపూర్ణమైన పని కల్పించకపోవడం దారుణమని ఈ సందర్భంగా మండిపడ్డారు.

 చదువు అంటే కేవలం మార్కుల పట్టిక కాదు:

 వందల కోట్లు వెచ్చించి కొత్త భవనాలు నిర్మించడం కంటేనూ..  గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాత జిల్లా పరిషత్ పాఠశాలలను బలోపేతం చేయాలని ఎంపీ ఈటెల ఈ సందర్భంగా సూచించారు. 3 నుంచి 5 ఎకరాల విశాలమైన స్థలాల్లో ఉన్న జిల్లా పరిష్త్ పాఠశాలలు.. పక్కనే హాస్టల్స్, ఆధునిక తరగతి గదులు నిర్మిస్తే అవే అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మారతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం  చేశారు. విద్యార్థులను కేవలం మార్కులు తెచ్చే యంత్రాలుగా మార్చే కార్పొరేట్ ధోరణిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  చదువు అంటే కేవలం మార్కుల పట్టిక కాదు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరగాలి. సొంత కాళ్ల మీద నిలబడే ధైర్యం, సమాజాన్ని నడిపించే శక్తి రావాలి. ఇంటర్, ఇంజనీరింగ్ విద్యార్థులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి మారాలని ఈటెల అన్నారు. 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News